Ravi Teja: మాస్ మహారాజ్ రవితేజ (Raviteja) హీరోగా తెరకెక్కిన సినిమా ‘టైగర్ నాగేశ్వరరావు’ (Tiger Nageswara Rao). రవితేజను పూర్తి మాస్, యాక్షన్ తరహా పాత్రలో నటించారు. ఇటివల విడుదలైన ట్రైలర్ లో రవితేజ పాత్ర, యాక్షన్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అక్టోబర్ 19న విడుదలవుతోన్న సినిమా ట్రైలర్ తో అంచనాలు భారీగా పెరిగాయి.
తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలవుతోందీ సినిమా. ఇప్పుడీ సినిమాను సంజ్ఞా భాష (సైన్ లాంగ్వేజ్)లో కూడా విడుదల చేస్తున్నారు మేకర్స్. ఈ భాషలో విడుదలవుతున్న తొలి తెలుగు సినిమా టైగర్ నాగేశ్వరరావు. ట్రైలర్ లో కూడా సంజ్ఞా భాషలో మాట్లాడుతున్న యాంకర్ కనిపిస్తారు. దీంతో సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను వంశీ తెరకెక్కించారు. జీ.వీ.ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. సినిమాను భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కించినట్టు నిర్మాత తెలిపారు. కథ అందరికీ చేరువ కావాలనే పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నట్టు తెలిపారు.