Switch to English

ఇన్ సైడ్ టాక్: రెంటికీ చెడ్డ రాపాక..!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పరిస్థితి అగమ్య గోచరంగా మారిందా? ఏదో ఊహించుకుని అధికార పార్టీతో అంటకాగిన ఆయనకు ఇప్పుడు తత్వం బోధపడుతోందా? సొంత నియోజకవర్గంలో రాజకీయంగా గడ్డు పరిస్థితి మొదలైందా? ఈ ప్రశ్నలన్నింటికీ ఔననే సమాధానం వినిపిస్తోంది.

మొన్నటి ఎన్నికల్లో జనసేన నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే అయిన రాపాక.. ఆది నుంచీ పార్టీతో అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తూ వచ్చారు. దీంతో ఆయన అధికార పార్టీలోకి వెళ్లిపోతారనే ప్రచారం జరిగింది. అయితే, జనసేనలో ఉంటే నా నెంబర్ ఒకటి.. వైసీపీలోకి వెళితే మాత్రం 151 అంటూ డైలాగులు కొట్టారు.

కానీ అందుకు కట్టుబడి ఉండలేదు. సీఎం జగన్ కు పాలాభిషేకాలు చేశారు. అవకాశం దొరికిన ప్రతిసారీ ఆయనకు జైకొట్టారు. గెలిచిన పార్టీకి వెన్నుపోటు పొడిచి అధికార పార్టీతో అంటకాగుతూ వచ్చారు. మరోవైపు 151 మంది బలం ఉన్న వైసీపీకి రాపాక అవసరం అస్సలు లేదు. అయినప్పటికీ ఆయన మాత్రం వైసీపీతో సత్సంబంధాలు నడుపుతూ వచ్చారు.

కానీ పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా? ఇప్పుడు అదే విషయం రాపాకకు బోధపడుతోంది అంటున్నారు. నిజానికి రాజోలు నియోజకవర్గంలో వైసీపీలోనే రెండు గ్రూపులున్నాయి. వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన బొంతు రాజేశ్వరరావుది ఒక వర్గం కాగా, పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జి అమ్మాజీదో మరో గ్రూపు.

ఈ నేపథ్యంలో ఎంట్రీ ఇచ్చిన రాపాక.. తొలుత అమ్మాజీ గ్రూపుతో కలసి నడిచారు. కొంతకాలంపాటు ఇది సజావుగానే సాగినా.. ఇటీవల అమ్మాజీ వర్గం రాపాకకు దూరంగా ఉంటోంది. ఈ క్రమంలోనే సీఎం జగన్ గ్రూపులన్నీ కలిపేసి ఒకటి చేయాలంటూ రాపాక స్టేట్ మెంట్ కూడా ఇచ్చారు. కానీ రానురాను నియోజకవర్గంలో పరిస్థితులు రాపాక చేజారిపోతున్నాయని అంటున్నారు.

నిజానికి జనసేనలోనే విధేయంగా ఉండి ఉంటే ఆయన పరిస్థితే వేరుగా ఉండేది. కానీ పార్టీకి దూరంగా ఉండటంతో జనసైనికులు ఆయన్ను పట్టించుకోవడమే మానేశారు. జనసేన నుంచి వెళ్లినంత మాత్రాన వైసీపీ కేడర్ రాపాక వెంట వచ్చే పరిస్థితే లేదు. ఇప్పటికే ఉన్నవారంతా అటు బొంతు, ఇటు అమ్మాజీ వర్గంలో ఉన్నారు. ఇటీవల అంతర్వేది ఆలయ రథం దగ్ధమైన సందర్భంగా అక్కడకు వెళ్లిన రాపాక వెంట బలగం లేకపోవడం ఆయన పరిస్థితికి అద్దం పడుతోందని అంటున్నారు.

ఈ నేపథ్యంలో తనకు సొంత వర్గాన్ని తయారుచేసుకునే పరిలో ఆయన నిమగ్నమయ్యారని చెబుతున్నారు. కానీ అది అంత సులభమైన విషయం కాదని స్పష్టంచేస్తున్నారు. జనసేనకు దూరం కావడంలో అటు జనసైనికుల మద్దతు లేక, ఇటు అధికార పార్టీలో ఇమడలేక.. రెంటికీ చెడ్డ రేవడిలా రాపాక పరిస్థితి తయారైందని పేర్కొంటున్నారు. మరి ఈ పరిస్థితులను రాపాక ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

9 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...