భళ్లాలదేవుడుగా పాన్ ఇండియా ఇమేజ్ సంపాదించుకున్నాడు, కానీ సినిమా సినిమాకి వైవిధ్యం చూస్తాడు, సినిమా సినిమాకి సరికొత్త ఎక్స్ పీరియన్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. రానా నటించిన ‘అరణ్య’ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది, మరోవైపు ‘విరాటపర్వం’ షూటింగ్ 10 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇదిలా ఉండగా ఈ లాక్ డౌన్ టైంలో రానా పెళ్లి చేసుకొని ఓ ఇంటి వాడయ్యాడు. పెళ్లి అనే సంబరం ముగియడంతో రానా మళ్ళీ సినిమాపై ఫోకస్ పెట్టాడు.
అందులో భాగంగా తాజాగా రానా ఓ సినిమాని ఓకే చేశారు. ఇలాంటి జానర్లో రానా ఇప్పటి వరకూ సినిమా చేయలేదు. ఇక విషయంలోకి వెళితే సిద్దార్థ్ హీరోగా వచ్చిన ‘గృహం’ సినిమా దర్శకుడు మిళింద్ రావ్ నేరేట్ చేసిన ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అతీంద్రియ శక్తుల నేపథ్యంలో సాగే సాహసోపేత ప్రయాణగాధగా ఉండనుంది. విజువల్ ఎఫెక్ట్స్ హై గా ఉండనున్న ఈ సినిమాని సూపర్ నాచురల్ అడ్వెంచర్ జానర్లో రూపొందించనున్న ఈ సినిమాని ఆచంట గోపినాథ్ తో కలిసి సురేష్ ప్రొడక్షన్స్ వారు నిర్మించనున్నారు.
ఈ సినిమాని కూడా రానా మార్కెట్ దృష్ట్యా పలు భాషల్లో రూపొందించనున్నారు. రానా ఇది వరకూ ఈ జానర్లో సినిమా చేయకపోవడం వలన కథ నచ్చగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే రానా గుణశేఖర్ దర్శకత్వంలో నటించనున్న ‘హిరణ్యకశ్యప’ సినిమా కూడా ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది.
919574 90278Attractive part of content. I just stumbled upon your web site and in accession capital to claim that I acquire in fact enjoyed account your blog posts. Any way Ill be subscribing to your feeds and even I achievement you get entry to constantly speedily. 568562