Rana : నేను రాజు నేనే మంత్రి సినిమా రానా కి సూపర్ హిట్ ని అందించిన దర్శకుడు తేజ మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. తేజ దర్శకత్వంలో వచ్చిన ‘అహింస’ సినిమా కమర్షియల్ గా నిరాశ పరిచిన విషయం తెల్సిందే. అయినా కూడా తేజ దర్శకత్వంలో రానా సినిమాను చేసేందుకు సిద్ధం అవుతున్నాడనే వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే వీరిద్దరి కాంబోలో రాక్షస రాజు సినిమా ప్రకటన వచ్చింది. ఆ సినిమా ఇప్పటికే ప్రారంభం అవ్వాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల వాయిదా పడ్డ విషయం తెల్సిందే. ఇప్పుడు రాక్షస రాజు సినిమా యొక్క షూటింగ్ ప్రారంభంకు ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం అందుతోంది.
ఇక ఈ సినిమాలో మలయాళ స్టార్ మోహన్ లాల్ ను నటింపజేసేందుకు దర్శకుడు తేజ ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. బావ – బావమరిది కథతో ఈ సినిమా తో తేజ రూపొందించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. బావ, బావమరిది మధ్య ఉండే సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయని సమాచారం అందుతోంది. దర్శకుడు తేజ త్వరలోనే ఈ విషయమై అధికారిక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి.