Switch to English

ప్రభుత్వ ఉద్యోగులపై రాధాకృష్ణ అనుచిత వ్యాఖ్యలు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేళ సంచలన అంశాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆంధ్రజ్యోతి పత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణ మధ్య జరిగిన ప్రైవేటు సంభాషణల వీడియోలు వైరల్ గా మారాయి. చంద్రబాబును ఇంటర్వ్యూ చేస్తున్న సమయంలో ఆఫ్ ది రికార్డుగా మాట్లాడిన కొన్ని అంశాలు వీడియోలో రికార్డయ్యాయి.

అవి ఎన్నికలకు ముందు బయటకు రావడంతో రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేగుతోంది. తొలుత విడుదలైన వీడియోలో దివంగత ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ఉండగా.. తాజాగా విడుదలైన వీడియోలో ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ.. ప్రభుత్వ ఉద్యోగులనుద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం, వాటిని టీడీపీ అధినేత చంద్రబాబు సమర్థించినట్టుగా మాట్లాడటం సంచలనం కలిగిస్తోంది.

ఉద్యోగులకు సెంట్రల్ పీఆర్సీ అమలుకు సంబంధించిన అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు చంద్రబాబు మాట్లాడగా.. రాధాకృష్ణ అడ్డుకుని, ‘‘అసలు రాష్ట్రాన్ని ఎటు తీసుకెళదాం అనుకుంటున్నారు అందరూ’’ అని బాబును ప్రశ్నించారు. దీనికి బాబు బదులిస్తూ అదేం కాదు.. అది వెయ్యి కోట్లో, రెండు వేల కోట్లో అవుతుంది అంతే’ అని పేర్కొన్నారు. ‘నాన్ ప్లాన్ ఇప్పటికే తడిసి మోపెడైంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంతే, ఇదీ అంతే. అయినా ఆ నా కొడుకులకు జీతాలు ఇవ్వడానికా జనం టాక్సులు కట్టేది’ అని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.

ఈ దశలో బాబు మాట్లాడుతూ.. ‘వాళ్లని కూడా లాగాలి కదా’ అని పేర్కొన్నారు. ‘సరే అది మీ ఇష్టం అనుకోండి. అది వేరే విషయం’ అని రాధాకృష్ణ మాట్లాడారు. దీనికి బాబు మళ్లీ స్పందిస్తూ.. ‘నేను చెప్పేది వింటావా. నువ్వు చెప్పేది కరెక్టే. కానీ అధికారం లేకపోతే మనం ఏమీ చేయలేం’ అని చెప్పడంతో వీడియో క్లిప్ కట్ అయింది. మరి దీనికి కొనసాగింపు క్లిప్ ఏమైనా ఉందో లేదో చూడాలి.

తొలుత విడుదలైన వీడియోలో ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ గురించి ఇరువురి మధ్యా సంభాషణ జరిగింది. ఇంకా పేరు మార్చలేదేంటని రాధాకృష్ణ అడగ్గా.. మార్చేద్దాం మార్చేద్దాం.. వాడి పేరు తీసేద్దాం అంటూ చంద్రబాబు అనడం సంచలనం సృష్టించింది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ను, తాజాగా ప్రభుత్వ ఉద్యోగులను కించపరిచేలా ఈ సంభాషణలు ఉన్నాయంటూ ప్రతిపక్ష నేతలు ఆరోపణలు చేశారు. దీనిపై రాధాకృష్ణ వివరణ కూడా ఇచ్చారు. ఎన్టీఆర్ ను ఉద్దేశించి తాము ఏమీ అనలేదని, వీడియోను కట్ అండ్ పేస్ట్ చేయడం ద్వారా ఆ అర్థం వచ్చేలా చేశారని వైఎస్సార్ సీపీని విమర్శించారు.

అయితే, తాజా వీడియోలో మాత్రం రాధాకృష్ణ ప్రభుత్వ ఉద్యోగులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం.. వాటిని చంద్రబాబు సమర్థించడం చాలా స్పష్టంగా తెలుస్తోంది. వీడియో ఆగినట్టుగా గానీ, జర్క్ ఇవ్వడం వంటి అంశాలు ఏవీ చోటుచేసుకోలేదు. దీంతో పోలింగ్ కు సరిగ్గా రెండు రోజుల ముందు వెలుగుచూసిన ఈ ఎపిసోడ్ ఎక్కడకు దారితీస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. దీని ప్రభావం ఓటింగ్ పై ఏమైనా పడుతుందేమో అని తెలుగు తమ్ముళ్లు కలవరపడుతున్నారు. మరి ఈ వ్యవహారాన్ని చంద్రబాబు, రాధాకృష్ణ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...