బిగ్‌హౌస్‌లో అంతా గందరగోళం. ఎవరేం చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో తెలియని పరిస్థితి. ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ సీజన్.. బిగ్‌బాస్ హిస్టరీలోనే అత్యంత చెత్త టాస్క్‌లతో చెత్త చెత్తగా నడుస్తోందనడం అతిశయోక్తి కాకపోవచ్చేమో. ఇది బిగ్‌బాస్ ఫాలోవర్స్ చెబుతున్నమాట. పరిస్థితి ఇంత దారుణంగా తయారయినా, డ్యామేజ్ కంట్రోల్ చర్యలేమీ లేవు. షోని ఫన్‌తో నడిపే ప్రయత్నం చేయడంలేదు. గ్రిప్పింగ్ మూమెంట్స్ అసలే కన్పించడంలేదు. ఇంకా ఇంకా చెత్త టాస్క్‌లతో ప్రేక్షకుల్ని విసిగించేస్తున్నాడు బిగ్‌బాస్.
కంటెస్టెంట్స్ మధ్య సిల్లీగా గొడవలు పెట్టి, వాటిని హైలైట్ చేసి.. బిగ్‌బాస్‌కి క్రేజ్ తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నా.. అవీ బెడిసి కొడుతున్నాయి. తాజాగా పునర్నవి భూపాలం, బిగ్‌బాస్‌ని బండ బూతులు తిట్టేసింది పరోక్షంగా. ‘బుల్ షిట్..’ అనే స్థాయికి పునర్నవి భూపాలం సంయమనం కోల్పోయిందంటే హౌస్‌లో టాస్క్‌లు ఎంత చెత్తలా వున్నాయో అర్థం చేసుకోవచ్చు. బిగ్‌బాస్‌కి ఒళ్ళు మండిందేమో, పునర్నవితోపాటు శ్రీముఖి, మహేష్‌లకు ‘షూ’ క్లీనింగ్ పనిష్‌మెంట్ ఇచ్చేశాడు.
Also Read: బిగ్‌బాస్-3 తెలుగులో ఆ ‘రియాల్టీ’ వుందా.?
శ్రీముఖి, ఆ పనిష్‌మెంట్‌ని ఒప్పేసుకుంటే, మహేష్ కొంత బెట్టు చేసిన విషయం విదితమే. ఆ తర్వాత మహేష్ కూడా సర్దుకుపోయాడు. పునర్నవి మాత్రం ససేమిరా అనేసింది. ఏమయ్యిందోగానీ, బిగ్‌బాస్ ఇప్పుడు దాన్ని పనిష్‌మెంట్ అని కాకుండా, టాస్క్‌గా అభివర్ణిస్తున్నాడు. కాస్సేపటి క్రితం విడుదల చేసిన ఓ ప్రోమోలో పనిష్‌మెంట్ కంప్లీటెడ్.. అని పేర్కొన్నారు. కానీ, అంతలోనే దాన్ని మార్చేసి, ఇంకో ట్వీట్ చేశారు స్టార్ మా సంస్థ తరఫున. కొత్త ట్వీట్‌లో ‘టాస్క్’ కంప్లీటెడ్ అని ప్రస్తావించారు. దానర్థం, పునర్నవికి బిగ్‌బాస్ క్షమాపణ చెప్పి, ఎలాగోలా ఆమెను బతిమాలుకున్నాడనే కదా.!
టాస్క్ గనుక, పునర్నవి షూస్ క్లీన్ చేయడానికి ఒప్పుకుని వుండాలి. ఆమె టాస్క్ కంప్లీట్ చేస్తున్న వైనం కూడా కన్పిస్తోంది. పేరు ఏదైతేనేం, అక్కడ జరిగింది షూస్ క్లీనింగ్ వ్యవహారం. మొత్తమ్మీద, కంటెస్టెంట్స్ దెబ్బకి బిగ్‌బాస్ దిగిరావడమంటే.. అది వింతే కదా మరి.!
