‘మా’ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు ప్యానల్స్ పరస్పర ఆరోపణలు తీవ్రం అవుతున్నాయి. ఈక్రమంలో విష్ణు ప్యానల్ నుంచి పోటీ చేస్తున్న పృథ్వీరాజ్‌కు సంబంధించిన ఓ ఫోన్ కాల్ ఆడియో పరిశ్రమలో కలకలం సృష్టిస్తోంది. ప్రకాష్ రాజ్ ని ఉద్దేశిస్తూ విమర్శిస్తూ ఆయన వ్యాఖ్యలు చెసారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఏపీ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు చెందిన ఓ సభ్యుడికి పృథ్వీరాజ్ ఈ ఫోన్ కాల్ చేశారు.
‘దేశంలో ఎవరు ఎక్కడైనా పోటీ చేయవచ్చు. కానీ.. మనల్ని పరిపాలించకూడదు. నాకు వైజాగ్‌తో మంచి అనుబంధం ఉంది. నా సినీ ప్రయాణం, రాజకీయ ప్రస్థానం మొదలైంది వైజాగ్ నుంచే. మీరు ఇటీవల ప్రకాశ్‌రాజ్‌ని సన్మానించడం నాకు నచ్చలేదు. ఆయనకెలా మీరు మద్దతు ఇస్తారు? ప్రకాశ్‌రాజ్ క్రమశిక్షణ బాలేదని ఫిల్మ్ ఛాంబర్ అసోసియేషన్ ఆయన్ని రెండుసార్లు సస్పెండ్ చేసింది. 25 ఏళ్లుగా ఆయన ‘మా’లో ఓటు వేయలేదు.
నేను ఓ కన్నడ సినిమా షూట్లో ఉన్నప్పుడు.. “కన్నడ వాళ్లు మాత్రమే ఇక్కడ నటించాలి” అంటూ నా విగ్గు లాగేసి” నాపై కేకలు వేశాడు. అలాంటిది.. మీకు ఆయన ఎందుకు అంత నచ్చాడు? పరాయిభాష వాళ్లపై మీకు అంత ఇష్టమేమిటి? ‘తెలుగువాడిని గెలిపిద్దాం.. తెలుగు ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం’’ అని పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
679506 891458Intending start up a enterprise about the web involves revealing marketing plus items not only to women locally, yet somehow to several buyers who are web-based as a rule. e-learning 163135
207548 357598so significantly very good info on here, : D. 235854
808839 750719Read more on that great Post, I linked to you Thanks. 911099
356272 559557It is onerous to search out knowledgeable individuals on this subject, nonetheless you sound like you already know what youre talking about! Thanks 349182