మారుతి సినిమాల్లో మెయిన్ ఎలిమెంట్ కామెడీనే. ఎంటర్‌టైన్‌మెంట్ బేస్డ్ ఫిలింస్ తీయడంలో మారుతి దిట్ట. అలాంటి మారుతి, సాయి ధరమ్ తేజ్‌తో తెరకెక్కిస్తోన్న ‘ప్రతి రోజూ పండగే’ సినిమాని డిఫరెంట్‌గా ప్లాన్ చేసినట్లున్నాడు. ఆ విషయాన్ని ప్రీ-లుక్‌తో చెప్పకనే చెప్పేశాడు. ‘సెలబ్రేషన్స్ మొదలయ్యాయ్..’ అని సినిమా టీమ్ ప్రీ-లుక్‌తో చెబుతోందిగానీ, అందులో ‘ఎమోషనల్ కొటేషన్’ ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.
హీరో, ఎవర్నో చెయ్యిపట్టుకుని పైకి లాగుతున్నాడు. ఇదీ ప్రీ-లుక్ సారాంశం. బహుశా ఈ సినిమాలో నటిస్తోన్న సత్యరాజ్‌ది ఆ ఇంకో చెయ్యి కావొచ్చు. ‘వేలు విడవని బంధం’ అంటే, దానర్థమేంటి.? కుటుంబ సంబంధాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోన్న విషయం విదితమే. డిసెంబర్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రేపు సాయంత్రం విడుదల చేయబోయే ఫస్ట్ లుక్ కోసం ఇదిగో ఇలా ఇప్పుడు ప్రీ లుక్ విడుదల చేశారు.
వరుస ఫ్లాపుల తర్వాత సాయి ధరమ్ తేజ్, ‘చిత్రలహరి’ సినిమాతో ఎట్టకేలకు ఓ విజయాన్ని అందుకున్నాడు. చాలా ఎమోషనల్ రోల్ చేశాడు ‘చిత్రలహరి’ సినిమాలో సాయి ధరమ్ తేజ్. ఈసారి మాత్రం ‘ప్రతి రోజూ పండగే’ అంటూ ఫుల్ ఆఫ్ సెలబ్రేషన్స్‌తో వచ్చేస్తానని తన అభిమానులకి సాయి ధరమ్ తేజ్ భరోసా ఇచ్చిన విషయం విదితమే.
Also Read: బన్నీ ప్రాజెక్ట్ .. మరో మెగా హీరో చేతుల్లోకి ?
ప్రీ-లుక్‌లో ఎమోషనల్ బాండ్ వున్నా, సినిమా నిండా కావాల్సినంత ఫన్ వుంటుందని ఇన్‌సైడ్ సోర్సెస్ చెబుతున్నాయి. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన రాశి ఖన్నా హీరోయిన్‌గా నటించింది. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘సుప్రీం’ సంచలన విజయాన్ని అందుకున్న విషయం విదితమే. ఆ మ్యాజిక్ మళ్ళీ ‘ప్రతి రోజూ పండగే’తో రిపీట్ అవుతుందా.? వేచి చూడాల్సిందే.
