Prabhas: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘హను-మాన్’ (Hanuman). పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా ప్రమోషన్ కు ఏదొక రూపంలో వస్తాడని దర్శకుడు ఇప్పటికే ప్రకటించాడు. అయితే.. ప్రభాస్ (Prabhas) స్పందించలేదు. ఈరోజు సాయంత్రం జరిగే ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) ముఖ్య అతిధిగా హాజరవుతున్నారు.
అయితే.. ప్రభాస్ రాకపోవడానికి కారణం కల్కి షూటింగ్ లో పాల్గొనడమేనని అంటున్నారు. పైగా.. కీలకమైన గెటప్ లో ప్రభాస్ ఉన్నాడని తెలుస్తోంది. షూటింగ్ పూర్తయ్యే వరకూ లుక్ రివీల్ కాకుండా ఉండేందుకు నాగ్ అశ్విన్ రిక్వెస్ట్ చేశాడని అంటున్నారు. అయితే.. రిలీజ్ కు 5రోజులే ఉండటంతో ప్రభాస్ మరే రూపంలో అయినా సినిమాను ప్రమోట్ చేస్తాడేమో చూడాలి.
సినిమాలో కంటెంట్ పై అటు సినీ వర్గాలు, ట్రేడ్, ప్రేక్షకుల్లోనూ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరోవైపు నార్త్ సైడ్ కూడా సినిమాకు భారీ బిజినెస్ జరిగింది. ఈ నేపథ్యంలో సినిమా పబ్లిసిటీ విషయంలో జాగ్రత్తలు తీసుకుంది యూనిట్.