సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ పెద్దన్న. అన్నాత్తేగా రూపొందిన ఈ చిత్రం తెలుగులో పెద్దన్న పేరుతో డబ్ అయింది. నవంబర్ 4న దీపావళి సందర్భంగా విడుదలైంది ఈ చిత్రం. మిక్స్డ్ రెస్పాన్స్ తో తమిళనాడులో ఓపెన్ అయిన ఈ చిత్రానికి దీపావళి సీజన్ కలిసి రావడంతో కలెక్షన్స్ బాగానే వచ్చాయి. అయితే తెలుగులో మాత్రం పెద్దన్న డిజాస్టర్ వైపు నడుస్తోంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా నైజాంలో ఈ చిత్ర కలెక్షన్స్ పూర్తిగా నిరాశాజనకంగా ఉన్నాయి. ఆదివారం నాడు కూడా పెద్దన్న కలెక్షన్స్ చాలా పూర్ గా ఉండడంతో రజినికు మరో ప్లాప్ వచ్చినట్లైంది. గత కొన్ని సినిమాలుగా రజినీ స్టామినా రెండు తెలుగు రాష్ట్రాల్లో నెమ్మదిస్తూ వస్తోంది. పెద్దన్నతో అది మరింత దిగజారినట్లైంది.
కొంత కాలంగా నాసిరకం సినిమాలు చేస్తూ వచ్చిన రజినీ దానికి మూల్యం చెల్లించుకుంటున్నాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
48620 130973It is essential to have having access to the understanding posted here 881006