అజ్ఞాతవాసి చిత్రం తరువాత సినిమాలకు పూర్తిగా దూరంగా ఉండి రాజకీయాల పైన దృష్టి పెట్టిన పవన్ కళ్యాణ్ మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వరకు ప్రచారం లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం మీడియా కి కనపడకుండా విశ్రాంతి తీసుకుంటున్న కళ్యాణ్ త్వరలో మైత్రి మూవీ మేకర్స్ వారి నిర్మాణం లో ఓ సినిమా చేయబోతున్నాడని టాక్ వస్తుంది. ఈ నెల 23 వ తేదీన ఏపీ ఎన్నికల ఫలితాలు రానున్నాయి అందులో జనసేన ఎన్ని సీట్లు గెలుస్తుందో అని అభిమానుల మధ్య చర్చలు జరుగుతున్నాయి, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా వార్తల గురించి సమాచారం రావడం తో అభిమానులు ఉత్సహం తో ఉన్నారు.
ప్రముఖ తెలుగు సినీ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ పవన్ కళ్యాణ్‌తో ఓ సినిమా తీయాలని గతం లో ప్లాన్ చేసారు, దానితో పాటు పవన్ కళ్యాణ్ నుంచి కమిట్మెంట్ తీసుకున్నారని, అప్పట్లో అడ్వాన్స్ రూపం లో కొంత డబ్బుని కూడా ఇచ్చినట్లు సమాచారం. అయితే అజ్ఞాతవాసి చిత్రం తరువాత సినిమాల కి దూరం గా ఉన్న పవన్ కళ్యాణ్ ఫుల్ టైం రాజకీయాల్లోకి రావడం తో ఆ సినిమా చేయలేకపోయారట.
40 రోజుల్లో సినిమా పూర్తి చేసే ఆలోచనలో మైత్రి మూవీ మేకర్స్ ?
ఒకేవేళ అన్ని కుదిరితే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం లో పవన్ కళ్యాణ్ 2019 చివరి లో సినిమా చేసే అవకాశం ఉంది . జనం కోసం రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ గారి సమయాన్ని వృధా చేయకుండా ఈ సినిమా ని 40 రోజుల్లో పూర్తి చేయాలనీ మైత్రి మూవీస్ ఆలోచన. ఈ సినిమా కోసం కళ్యాణ్ కి 30 కోట్ల వరకు పారితోషికం ఇచ్చే యోచనలో ఉన్నారట నిర్మాతలు. ఈ సినిమా కి దర్శకుడు ఎవరు ? ఎలాంటి కథతో సినిమా ఉండబోతుంది అనే కీలక సమాచారం ఇంకా బయటకు రాలేదు.. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతల నుండి అధికారిక సమాచారం వచ్చే వరకు పవన్ అభిమానులు వేచి చూడాల్సిందే…