గంగోత్రి సినిమా చేసిన తరువాత అటు ఇండస్ట్రీ నుండి ఇటు ప్రేక్షకుల వరకు అల్లు అర్జున్ లుక్స్ పైన చాలా కామెంట్స్ చేసారు. ఆ చిత్రం తరువాత సుకుమార్, అల్లు అర్జున్ కలయిక లో వచ్చిన ఆర్య సినిమా అల్లు అర్జున్ కి యూత్ లో మంచి ఫాలోయింగ్ ని తెచ్చింది. వన్ సైడ్ లవ్, ఫీల్ మై లవ్ అంటూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్స్, స్టెప్స్ తో విమర్శించిన వారితో కూడా ప్రశంసలు పొందాడు. ఆర్య సినిమా విడుదలై 15 సంవత్సరాలు అవుతుండడంతో ఈ సందర్భంగా బన్నీ ఆ సినిమాను గుర్తుచేసుకుంటూ సోషల్‌మీడియాలో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు.
‘ఇప్పటికీ నేను అంతే ప్రేమను ఫీలవుతున్నాను. నా జీవితంలో ‘ఆర్య’ మ్యాజికల్ మూవీ. ఇది నా జీవితాన్ని మార్చేసింది. సినిమా విడుదలై నేటికి పదిహేనేళ్లు పూర్తవుతోందంటే నమ్మలేకపోతున్నాను. ధన్యవాదాలు సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్, రత్నవేలు, దిల్‌రాజు. అన్నింటికి మించి నన్ను ఎంతగానో ఆదరించిన ప్రేక్షకులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అని పేర్కొంటూ ‘ఆర్య’ పోస్టర్‌ను పంచుకున్నారు.
ఆర్య సినిమా కి సీక్వెల్‌గా 2009 లో సుకుమార్ దర్శకత్వం లో అల్లు అర్జున్ ఆర్య 2 సినిమాలో నటించాడు. ప్రస్తుతం వీరి కలయికలో త్వరలో మూడో సినిమా కూడా సెట్స్ పైకి వెళ్లబోతుంది.