మాట చాలా గట్టిగా వుంటుంది. ఔను, ఆ మాట చాలా చాలా స్పష్టంగా వుంటుంది. బహుశా నిజాయితీకి వుండే ధైర్యం వల్లనే, ఆ మాట అంత గట్టిగా, స్పష్టంగా వస్తుందేమో.! తరచుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ మాట చెబుతుంటారు. చెప్పడం మాత్రమే కాదు, ఆ బలమైన మాటని ఇంకా బలంగా జనంలోకి తీసుకెళుతుంటారు.
తాజాగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పర్చూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన కౌలు రైతు భరోసా యాత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. పంట నష్టం కారణంగా ఏర్పడ్డ ఆర్థిక ఇబ్బందులతో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు జనసేనాని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఒక్కో రైతు కుటుంబానికీ లక్ష రూపాయల చొప్పున జనసేనాని ఆర్థిక సాయం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే జనసేనాని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘జనసేన పార్టీకి ప్రజలతోనే పొత్తు.. ఇంకెవరితోనూ పొత్తులు లేవు..’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టతం చేశారు. ప్రజల కోసం, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ప్రధాని నరేంద్ర మోడీతోనే విభేదించిన విషయాన్ని జనసేన అధినేత గుర్తు చేశారు.
కాగా, ‘క్రిమినల్ కేసులున్న యువతకు ఉద్యోగాలు రావు.. అదే క్రిమినల్ కేసులుండే నాయకులు ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తారు.?’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం గమనార్హం. ఇది ప్రజలు ఆలోచించాల్సిన అంశం. ఓటు వేసేటప్పుడు, తాము ఎవరికి ఓటేస్తున్నామన్న సోయతో జనం ఓట్లెయ్యాల్సి వుంటుంది. కానీ, రాజకీయాల్లో కేసులు ఎన్ని ఎక్కువ వుంటే అంత ఘనత.. అని చెప్పుకునే పరిస్థితికి రాజకీయ వ్యవస్థను రాజకీయ నాయకులు దిగజార్చేశారు.
‘బాధ్యత కలిగిన వ్యక్తులను అసెంబ్లీకి పంపే వరకూ ఆంధ్రప్రదేశ్ బాగుపడదు..’ అంటూ ఇంకో బలమైన మాటని, జనంలోకి ఇంకా బలంగా తీసుకెళ్ళారు పవన్ కళ్యాణ్. అప్పులు చేసి, సంక్షేమ పథకాల పేరుతో పబ్లిసిటీ స్టంట్లు చేసే రాజకీయ నాయకులకు బాధ్యతెక్కడుంటుంది.? ఇదే విషయాన్ని జనసేనాని నొక్కి వక్కాణించారన్నది జనసైనికులు చెబుతున్న విషయం.
మేటర్ క్లియర్.! తనను దత్త పుత్రుడని విమర్శిస్తోన్న వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, ‘క్రిమినల్ కేసులున్న నాయకులు ఎన్నికల్లో పోటీ చేయకూడదు..’ అనడం ద్వారా పవన్ కళ్యాణ్ ఇవ్వాల్సిన స్థాయిలోనే డోస్ ఇచ్చేసినట్లే అనిపిస్తోందన్నది రాజకీయ వర్గాల్లో వినిపిస్తోన్న అభిప్రాయం.
157220 181479Some genuinely rattling function on behalf with the owner of this site , utterly fantastic content material material . 866056
738118 737759Some genuinely marvellous work on behalf of the owner of this internet site, utterly outstanding content material. 139662
204285 680901In todays news reporting clever journalists function their own slant into a story. Bloggers use it promote their works and many just use it for enjoyable or to stay in touch with friends far away. 883603
666146 634258Some times its a pain inside the ass to read what weblog owners wrote but this internet internet site is truly user genial ! . 543345
140293 613394Thanks so significantly for an additional post. I be able to get that kind of details information. friend, and exactly. 139839
390346 126500Extremely well written story. It is going to be valuable to anyone who usess it, including yours truly . Maintain up the very good function – canr wait to read far more posts. 14012