ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోతున్న సమయంలో హైద్రాబాద్ – కేంద్ర పాలిత ప్రాంతం (యూటీ) అనే వాదన తెరపైకొచ్చిన సంగతి తెల్సిందే. ఆ దిశగా కొందరు డిమాండ్ చేశారు కూడా. కానీ, హైదరాబాద్ రెండు తెలుగు రాష్ట్రాలకూ ఉమ్మడి రాజధాని అయ్యింది.. తెలంగాణ కు గుండెకాయ అయిన హైద్రాబాద్‌ని వదులుకునేందుకు తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదు. ఆ విషయం అందరికీ తెలుసు.
నిజానికి, హైద్రాబాద్ యూటీ అనే వాదన అస్సలేమాత్రం సమర్థనీయం కాదు కూడా. మొదట్లో హైద్రాబాద్ మీద ‘ఉమ్మడి హక్కు’ విషయమై కొందరు రాజకీయ నాయకులు హడావిడి చేసినా, ఆ తర్వాత వాళ్ళకి కూడా పూర్తిగా జ్ఞానోదయమయ్యింది. కానీ, ఇప్పుడు అనూహ్యంగా మజ్లిస్ పార్టీ ‘హైద్రాబాద్ యూటీ’ అంశాన్ని తెరపైకి తెచ్చింది. బీజేపీ హయాంలో హైద్రాబాద్ యూటీ అయ్యే అవకాశముందంటూ మజ్లిస్ పార్ట అధినేత అసదుద్దీన్ ఒవైసీ పార్లమెంటు సాక్షిగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
హైద్రాబాద్ ఒక్కటే కాదు, చెన్నయ్ సహా బెంగళూరు తదితర నగరాలకీ ‘యూటీ దుస్థితి’ పట్టబోతోందని జోస్యం చెప్పారు అసదుద్దీన్ ఒవైసీ. కాశ్మర్పై చర్చ సందర్భంగా ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అత్యంత వ్యూహాత్మకంగా ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేశారన్నది నిర్వివాదాంశం. అయితే, బీజేసీ అంతటి రిస్క్ తీసుకునే అవకాశమే లేదు. ఎందుకంటే, దేశంలో అది తీవ్రరమైన రాజకీయ అలజడికి కారణమవుతుంది. తెలంగాణ, తమిళనాడు, కర్నాటక.. ఇలా ఏ రాష్ట్రం కూడా తమ రాజధానుల్ని యూటీ చేస్తామంటే ఒప్పుకోదు.
ఢిల్లీకి రాష్ట్ర హోదా కావాలనే డిమాండ్ చాలా కాలంగా విన్పిస్తోంది. అలాంటప్పుడు, ఏ రాష్ట్ర రాజధానినైనా యూటీ చేయాలని మోడీ సర్కార్ ఎందుకు అనుకుంటుంది.? ఇక్కడ మజ్లిస్ రాజకీయ వ్యూహం సుస్పష్టం. తెలంగాణలో అలజడి కోసం మజ్లిస్ ప్రయత్నిస్తోంది. తద్వారా మిత్రపక్షం టీఆర్ఎస్ పొలిటికల్ మైలేజ్ పెంచాలని మజ్లిస్ భావిస్తున్నట్టుంది. లేదంటే, బీజేపీతో తెరవెనుకాల లాలూచీ కూడా నడుపుతోన్న మజ్లిస్ పార్టీ.. కొత్త గేమ్ ప్లాన్ ఏమైనా రచిస్తోందా.? అన్నదీ అనుమానమే.
188138 991915Keep up the great piece of function, I read few blog posts on this web website and I believe that your site is real interesting and has lots of great info. 986694
75296 948926Id forever want to be update on new posts on this web site , bookmarked ! . 935451
819423 138168You should be a part of a contest first of the most effective blogs online. Let me suggest this blog! 602188