Switch to English

సర్వేల్లో సత్యం ఎంత?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఎన్నికలు వస్తున్నాయంటే చాలు.. సర్వేలు తెరపైకి వచ్చేస్తాయి. ఫలానా పార్టీకి ఇన్ని సీట్లు.. ఫలానా పార్టీదే అధికారం అంటూ బోలెడు ఊహాగానాలు హల్ చల్ చేస్తుంటాయి. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలోనూ పలు సర్వేలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటివరకు వచ్చిన సర్వేలను ఓసారి పరిశీలిస్తే.. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మ్యాజిక్ ఫిగర్ కి సమీపంలో ఆగిపోతుందని ఎక్కువ సర్వేలు వెల్లడించాయి. అదే సమయంలో కాంగ్రెస్ పరిస్థితి కూడా ఏమీ బాగోలేదని విశ్లేషించాయి. మొత్తమ్మీద ఎన్డీఏనే మరోసారి గద్దెనెక్కే అవకాశం ఉందని తేల్చాయి.

ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే.. ప్రతిపక్ష వైఎస్సార్ సీపీదే విజయం అంటూ ఎక్కువ సర్వేలు వెల్లడించాయి. ఆ పార్టీకి ఒకసారి అవకాశం ఇవ్వాలని ఎక్కువ మంది ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నాయి. ముఖ్యంగా రూరల్ ప్రాంతాల్లో ఈ భావన అధికంగా ఉందని తెలిపాయి. ఆశ్చర్యకరంగా అధికార తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఒక్క సర్వే కూడా రాలేదు. రెండు రోజుల క్రితం ఏపీలో టీడీపీదే అధికారం అంటూ ఓ పత్రికలో వచ్చిన వార్త పూర్తి అవాస్తమని తేలింది.

ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ సర్వేలు హోరెత్తాయి. అయితే, అక్కడ కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమిదే అధికారం అంటూ పలు సర్వేలు తమ అంచనాలు వెల్లడించాయి. ఆంధ్రా ఆక్టోపస్ గా పేరొందిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వే కూడా మహాకూటమికే అధికారం అని తేల్చింది. ఒక్క సర్వే తప్ప మిగిలిన సర్వేలన్నీ మహాకూటమికే అధికారం అని పేర్కొనగా.. ఫలితాలు మాత్రం వీటికి విరుద్ధంగా వచ్చాయి.

ఈ నేపథ్యంలో అసలు ఈ సర్వేల్లో శాస్త్రీయత ఎంత? వాటిలో విశ్వసనీయత ఏ మేరకు ఉంటుంది? అనే సందేహాలు తలెత్తుతాయి. దాదాపుగా లక్షన్నర నుంచి రెండు లక్షల మంది ఓటర్లు ఉండే నియోజకవర్గంలో పదుల సంఖ్యలో జనాల అభిప్రాయాలను మాత్రమే క్రోడీకరించి వెల్లడించే ఫలితాలు ఎంతవరకు నిజమవుతాయనే సందేహం రాక మానదు. సర్వేకి తీసుకునే శాంపిల్ సైజ్ తో పాటు ఎన్ని నియోజకవర్గాల్లో, ఏయే వయసులవారిని ప్రాతిపదికగా తీసుకుని అధ్యయనం నిర్వహించారనే అంశాలపైనే ఆయా సర్వేల శాస్త్రీయత ఆధారపడి ఉంటుంది.

ఎక్కువ నియోజకవర్గాల్లో, భారీ సంఖ్యలో శాంపిల్ తీసుకుని, అత్యంత శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించిన సర్వే ఫలితాలు మాత్రమే వాస్తవ ఫలితాలకు దగ్గరగా వచ్చే అవకాశం ఉంటుంది. సర్వే శాంపిల్ పెరిగే కొద్దీ ఫలితాల అంచనాల్లో కచ్చితత్వం కూడా పెరుగుతుంది. నిజానికి ఓటరు ఏ పార్టీకి ఓటు వేయాలో ఎన్నికలకు ముందుగానే నిర్ణయం తీసుకుంటాడని, అనంతరం అతడు ప్రభావితమయ్యే స్థాయిలో ఏవైనా నిర్ణయాలు జరిగితే మినహా అతడి ఆలోచనలో మార్పు రాదనేది అంచనా.

ప్రస్తుత పరిస్థితుల్లో జననాడి పట్టుకోవడం అంత సులభం కాదు. జనాల్లో చైతన్యం బాగా పెరిగింది. కేవలం పత్రికల మీదే ఆధారపడి ఉన్న రోజుల్లో అవి ఏది చెబితే అదే నిజమని నమ్మేవారు. కానీ ప్రస్తుతం ప్రపంచం మారింది. సోషల్ మీడియా హవా పెరిగింది. ఫలితంగా జనాలకు వాస్తవ విషయాలు బోధపడుతున్నాయి. అందుకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే సర్వేలకు కూడా వారి నాడి పూర్తిగా అందడంలేదు. రాజకీయ పార్టీలు కూడా సర్వేలు తమకు అనుకూలంగా ఉన్నాయని సంబరపడి ఆదమరచి కూర్చుంటే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంటుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...