టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్‌రెడ్డి నిన్న జైలు నుంచి విడుదలైన విషయం విదితమే. బస్సుల కొనుగోళ్ళలో అక్రమాలకు పాల్పడ్డారనీ, పర్మిట్లు లేకుండా బస్సులు నడుపుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో దివాకర్ ట్రావెల్స్ నిర్వహిస్తోన్న జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్ రెడ్డిపై కేసులు నమోదవడం, ఈ నేపథ్యంలో ఆ ఇద్దర్నీ అరెస్ట్ చేసి, రిమాండ్‌కి తరలించడం తెలిసిన విషయాలే.
ఇటీవల బెయిల్ లభించడంతో జైలు నుంచి విడుదలైన జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన తనయుడు.. విడుదల సందర్భంగా, పెద్దయెత్తున కార్యకర్తలతో హంగామా చేశారంటూ సరికొత్త ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. విధి నిర్వహణలో వున్న పోలీసు అధికారులపై ‘దురుసుగా వ్యవహరించారు’ అనే అభియోగాలూ ఆయనపై తాజాగా మోపబడ్డాయి. కరోనా నిబంధనల్ని ఉల్లంఘించారంటూ మొత్తం 31 మంది టీడీపీ నేతలు, కార్యకర్తలపై కేసులు నమోదవడం గమనార్హం.
నిజానికి జేసీ ప్రభాకర్‌రెడ్డికి ‘దురుసుగా’ వ్యవహరించడం అనేది వెన్నతో పెట్టిన విద్య. ఇలాంటి కేసులు ఆయన మీద చాలానే వున్నాయి. అన్నిటికీ మించి, ఆయన నోరు అస్సలేమాత్రం అదుపులో వుండదు. ఇక, రాష్ట్రంలో కరోనా నిబంధనల్ని ఉల్లంఘించి రాజకీయ కార్యక్రమాలు చేయడంలో అధికార పార్టీ నేతలు చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. అయినాగానీ, చిత్రంగా అధికార పార్టీ నేతలపై పోలీసులు ఎలాంటి చర్యలూ తీసుకోవడంలేదన్న విమర్శలున్నాయి.
ఇటీవల మూడు రాజధానుల వ్యవహారానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వైసీపీ నేతలు ర్యాలీలు నిర్వహించారు. మరి, అప్పుడు లేని నిబంధనల ఉల్లంఘన, జేసీ ప్రభాకర్‌రెడ్డి విషయంలోనే ఎందుకు కన్పిస్తోందంటూ టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ‘జైల్లో వున్నప్పుడూ మా పట్ల కక్ష పూరితంగా వ్యవహరించారు.. ఇప్పుడూ మా మీద కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు..’ అంటూ అధికార పార్టీపై గుస్సా అవుతున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి.
938898 528701Thank you a good deal for giving every person an extraordinarily particular possiblity to check ideas from here. 193122
484276 275039I actually got into this write-up. I found it to be interesting and loaded with distinctive points of interest. I like to read material that makes me feel. Thank you for writing this great content material. 124817
286323 403213If you happen to significant fortunate people forms, referring by natural means, furthermore you catch the attention of some sort of envy in consideration of those types the other campers surrounding you which have tough times about this subject. awnings 672609
704730 949975An intriguing discussion is worth comment. Im certain that you simply write regarding this topic, may possibly not be considered a taboo subject but typically persons are too small to communicate on such topics. To another. Cheers 76500
801331 270465I identified your weblog site on google and check a couple of of your early posts. Proceed to sustain up the superb operate. I just additional up your RSS feed to my MSN Information Reader. In search of forward to reading extra from you later on! 223256