Switch to English

ఉన్న ఊరిని వదల్లేక.. తన చితి తానే పేర్చుకుని.. ఆత్మాహుతి చేసుకున్న వృద్ధుడు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

‘ఆస్తులు, ఊళ్లతోపాటు నా కొడుకులు నన్ను కూడా పంచుకున్నారు. నన్ను సగభాగం కోసి పంచుకోలేరు కదా అందుకే ఆరు నెలలు ఒక కొడుకు దగ్గర మరో ఆరు నెలలు ఇంకో కొడుకు దగ్గర ఉంటాను. ఇక్కడ ఆరు నెలలు గడిచిపోయింది. రేపు మరో కొడుకు దగ్గరికి వెళ్ళాలి’ అంటూ కొన్నాళ్ల క్రితం వచ్చిన ఓ సినిమాలో హీరోయిన్ తాత హీరోతో తన బాధను పంచుకుంటాడు.

నిజానికి ఇది సినిమానే అయినా నిజజీవితంలోనూ ఇలాంటి ఉదంతాలు కోకొల్లలు. కని పెంచిన తల్లిదండ్రులకి వయోభారం మీద పడగానే కన్నబిడ్డలు వదిలించేసుకుంటున్నారు. వృద్ధాశ్రమాలకి ‘ఓల్డ్ ఏజ్ హోమ్స్’ అనే అందమైన పేరు పెట్టి వారిని వదిలించుకుంటున్న వారు కొందరైతే.. తల్లిదండ్రుల పోషణను వంతుల వారీగా పంచుకుంటున్న వాళ్ళు ఇంకొందరు. ఇటు వృద్ధాశ్రమాల్లో ఉండలేక వంతుల వారి పోషణలో ఇమడలేక తనువు చాలిస్తున్న పండుటాకులెన్నో. తాజాగా సిద్దిపేటలో ఇలాంటి హృదయ విధారక ఘటన చోటు చేసుకుంది. పుట్టి పెరిగిన ఊరిని వదిలిపెట్టి వెళ్లలేక, కొడుకుల వంతుల వారి పోషణ మింగుడు పడక తన చితి తానే పేర్చుకొని ఆత్మాహుతి చేసుకున్నాడో వృద్ధుడు.. వివరాల్లోకెళ్తే..

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లి కి చెందిన మేడబోయిన వెంకటయ్య (90) భార్య కొంతకాలం కిందటే మరణించింది. ఆయనకు నలుగురు కుమారులు కనకయ్య, ఉమ్మయ్య, పోచయ్య ,ఆరయ్య ఒక కుమార్తె ఉన్నారు. వీరిలో ఇద్దరు కుమారులు పొట్లపల్లిలో, మరొకరు హుస్నాబాద్ లో, ఇంకొకరు కరీంనగర్ జిల్లా నవాబుపేటలో నివసిస్తున్నారు. వెంకటయ్య కొన్నాళ్లపాటు పెద్ద కుమారుడు కనకయ్య వద్ద ఉన్నాడు. అయితే పోషణ విషయంలో పెద్ద కొడుకు పంచాయతీకి వెళ్లడంతో.. వెంకటయ్యని నలుగురు కుమారులు వంతుల వారీగా పోషించాలని గ్రామ పెద్దలు తీర్పు చెప్పారు.

దీంతో పొట్లపల్లిలో ఉన్న ఇద్దరు కుమారుల వంతు తీరింది. ఇక నవాబుపేటలో ఉన్న కొడుకు వద్దకు వెళ్లాల్సి ఉంది. ఊరు వదిలి వెళ్లడం ఇష్టంలేని వెంకటయ్య ఈనెల 2న ఆ ఊరిలోని ప్రజా ప్రతినిధి వద్దకు వెళ్లాడు. ఆ రాత్రి అక్కడే నిద్రించి నవాబుపేటలోని తన కుమారుడి వద్దకు వెళ్తానని చెప్పి అక్కడనుండి వెళ్ళిపోయాడు. సాయంత్రం వరకు ఏ కుమారుడు వద్దకు వెళ్లలేదు. గురువారం మధ్యాహ్నం పొట్లపల్లి గ్రామ సమీపంలో కాలిన స్థితిలో మృతదేహం కనిపించింది. ఆ మృతదేహం వెంకటయ్య దేనని కుటుంబ సభ్యులు గుర్తించారు. అదే స్థలంలో కుప్పగా పేర్చిన తాటి కమ్మలు కాలిన స్థితిలో కనిపించాయి. దీంతో వెంకటయ్య తాటి కమ్మలను కుప్పగా పేర్చి దానికి నిప్పంటించి అందులో దూకి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటన పై దర్యాప్తు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...