సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్, తన సుదీర్ఘమైన సినీ ప్రస్థానంలో ఎన్నో విజయాల్ని చవిచూశారు. జయాపజయాల సంగతి పక్కన పెడితే, తనదైన నటనతో సుదీర్ఘ కాలంగా ఆయన తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తూనే వున్నారు. రాజేంద్రప్రసాద్ ఏ సినిమాలో నటించినా, తెరపై ఆయన నటన కన్పించదు.. ఆ పాత్ర మాత్రమే కన్పిస్తుంటుంది. అదీ ఆయన ప్రత్యేకత.
కామెడీ హీరో పాత్రల నుంచి, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిన రాజేంద్రప్రసాద్ ప్రతి సినిమాలోనూ తనదైన కొత్తదనం చూపిస్తూనే వున్నారు. అలాంటి రాజేంద్రప్రసాద్ మీద ఓ గాసిప్ పుట్టుకొచ్చింది. ‘ఓ బేబీ’ సెట్లో తప్పతాగి రాజేంద్రప్రసాద్ నానా యాగీ చేశారన్నది ఆ గాసిప్ సారాంశం. అయితే, ఈ గాసిప్‌పై రాజేంద్రప్రసాద్ చాలా ఘాటుగా స్పందించారు. ‘అది నటన, షాట్‌కి రెడీ అవుతున్న సమయంలో చేసిన యాక్షన్ అది. తాగినట్లు నటిస్తే, తాగేసినట్లేనా? యాగీ చేసేసినట్లేనా.? నేను చదువుకున్న నటుడ్ని..’ అంటూ రాజేంద్రప్రసాద్ మండిపడ్డారు.
సోషల్ మీడియాలో ఇలాంటి విషయాలకి మంచి క్రేజ్ ఏర్పడుతున్న దరిమిలా, రాజేంద్రప్రసాద్ ‘తాగుడు’ వీడియో వైరల్‌గా మారింది. దాంతో, తన ఇమేజ్ డ్యామేజీ అవుతుందనుకున్నారో ఏమో, రాజేంద్రప్రసాద్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. మరోపక్క, ‘ఓ బేబీ’ యూనిట్, తమ సినిమా నిర్మాణంలో రాజేంద్రప్రసాద్ సహకారం చాలా గొప్పదనీ, సెట్లో ఎక్కడా ఆయన ‘అతి’గా ప్రవర్తించలేదనీ, ఆయన నిబద్ధతగల నడుడనీ అంటోంది.
కొంతకాలం క్రితం రాజేంద్రప్రసాద్ మీద మాళవిక అనే ఓ తమిళ నటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఓ పాట షూటింగ్ సందర్భంగా తనతో అసభ్యంగా రాజేంద్రప్రసాద్ ప్రవర్తించారన్నది ఆమె అప్పట్లో చేసిన ఆరోపణ. అయితే, ఆ తర్వాత ఆ వివాదం సద్దుమణిగిందనుకోండి. అది వేరే విషయం. రాజేంద్రప్రసాద్ సుదీర్ఘమైన కెరీర్లో.. ఇప్పటిదాకా ఈ రెండు వివాదాలు మాత్రమే కన్పించాయి. అయితే, రెండూ ఉత్తవేనని తేలిపోయానుకోండి. అది వేరే సంగతి. ఇక, సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఓ బేబీ’ ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకొస్తున్న సంగతి తెల్సిందే.
876562 273686Just a smiling visitor here to share the really like (:, btw outstanding layout. 502663
290086 798976Hi, you used to write exceptional articles, but the last several posts have been kinda boring I miss your tremendous posts. Past couple of posts are just a bit out of track! 266878
169784 258694Woh Everyone loves you , bookmarked ! My partner and i take concern in your last point. 454546
970010 73363Do you mind if I quote a couple of your posts as long as I supply credit and sources back to your site? My blog is inside the exact identical region of interest as yours and my visitors would truly benefit from some of the data you supply here. Please let me know if this ok with you. Thanks! 549106