విశాఖలో ఇటీవల జరిగిన దళిత యువకుడి శిరోముండనం ఘటనలో ‘బిగ్‌బాస్ 2 తెలుగు’ రియాల్టీ షో కంటెస్టెంట్ నూతన్ నాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే నూతన్ నాయుడు భార్య సహా నూతన్ నాయుడు ఇల్లు, కార్యాలయాల్లో పనిచేస్తోన్న కొందర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం విదితమే. దళిత యువకుడిపై అత్యంత హేయంగా దాడి చేసి మరీ, ఆ యువకుడికి శిరోముండనం చేశారు నూతన్ నాయుడు ఇంట్లో. అయితే, ఆ సమయంలో నూతన్ నాయుడు ఇంట్లో లేనట్లు తెలుస్తోంది. నూతన్ నాయుడు భార్య సమక్షంలోనే ఈ అమానవీయ ఘటన జరిగింది.
కాగా, ఈ కేసుతో నూతన్ నాయుడికి కూడా సంబంధం వుందని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో అక్కడున్న కొందరు మొబైల్ ఫోన్లలో ఆ ఘటనను చిత్రీకరించారు. అది వీడియో కాల్ రూపంలో నూతన్ నాయుడికి చూపించారనే అనుమానాలున్నాయి. నూతన్‌నాయుడు కర్ణాటక లోని ఉడిపి లో వుండగా అతన్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం కర్నాటక పోలీసుల అదుపులో నూతన్ నాయుడు వున్నాడట. అతన్ని త్వరలోనే విశాఖకు తీసుకురానున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
కాగా, మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ పేరుతో ఫోన్లు చేస్తూ నూతన్ నాయుడు మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. నూతన్ నాయుడు నుంచి 3 మొబైల్ ఫోన్లనూ స్వాధీనం చేసుకున్నారట పోలీసులు. ఏకంగా 30 మంది అధికారులకు పీవీ రమేష్ పేరుతో నూతన్ నాయుడు ఫోన్లు చేసినట్లు గుర్తించామని విశాఖ సీపీ మనీష్ కుమార్ సిన్హా వెల్లడించడం గమనార్హం.
నూతన్ నాయుడు విషయమై రాష్ట్రంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకీ, జనసేన పార్టీకీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. నూతన్ నాయుడు తనను తాను పవన్ కళ్యాణ్ అభిమానిగా ప్రొజెక్ట్ చేసుకోవడం అందరికీ తెలిసిన విషయమే. అయితే, గతంలో వైఎస్సార్సీపీ కోసం పనిచేశాడాయన. వైసీపీ రాజకీయ విధి విధానాల్ని తానే రాసినట్లు అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు నూతన్ నాయుడు. ఇదిలా వుంటే, ఇటీవల ‘పరాన్నజీవి’ అనే సినిమాని నూతన్ నాయుడు రూపొందించిన సంగతి తెలిసిందే.
838444 820507Hey there! Good post! Please when all could see a follow up! 8447
809729 810547Quite interesting topic , appreciate it for posting . 858773
586849 791729Hiya! awesome blog! I happen to be a day-to-day visitor to your web site (somewhat far more like addict ) of this site. Just wanted to say I appreciate your blogs and am seeking forward for far more to come! 677981
779192 146240Great humans speeches and toasts, possibly toasts. are hands down transferred at some time via party and expected to turn into extremely funny, amusing not to mention educational inside the mean time. finest man wedding speeches 624778