యంగ్ టైగర్ ఏ రంగంలో అయినా రాణించగలడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎన్టీఆర్ తెలుగు మాట్లాడే తీరు ప్రస్తుత యంగ్ తెలుగు హీరోల్లో ఎవరికి రాదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. బుల్లి తెరపై ఇప్పటికే బిగ్ బాస్ ద్వారా పరిచయం అయిన ఎన్టీఆర్ ఇప్పుడు మరో సారి బుల్లి తెరపై కనిపించబోతున్నాడు. సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం జెమిని ఛానెల్ లో ఒక టాక్ షోలో ఎన్టీఆర్ కనిపించబోతున్నాడట. ఆ విషయమై ఇప్పటికే చర్చలు సంప్రదింపులు కూడా పూర్తి అయ్యాయి అంటున్నారు.
ప్రస్తుతం ఈ టాక్ షో కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లోని ఏడు ఎకరాల్లో ఒక భారీ ఇండోర్ సెట్టింగ్ ను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలోనే ఎన్టీఆర్ టాక్ షో ప్రారంభం అవ్వబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఎన్టీఆర్ యాంకర్ గా పాతిక మంది సెల్రబెటీలతో మొదటి సీజన్ ఉంటుందని అంటున్నారు. ఎన్టీఆర్ ను బుల్లి తెరపై చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. జెమిని వారు భారీ పారితోషికంను ఇచ్చి మరీ ఎన్టీఆర్ తో ఒప్పందం చేసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో ఉన్న ఎన్టీఆర్ ఇదే సమయంలో టాక్ షో కూడా చేస్తాడేమో చూడాలి. ఆర్ఆర్ఆర్ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చేయాల్సి ఉంది.
9270 743117This internet internet site may be a walk-through its the data you wanted in regards to this and didnt know who ought to. Glimpse here, and you will definitely discover it. 360096