Devara : యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో రూపొందుతున్న దేవర సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా ఇదే అవ్వడం వల్ల ఆకాశాన్ని తాకే అంచనాలు ఉన్నాయి అనడంలో సందేహం లేదు.
కొరటాల శివ గత చిత్రం ఫలితం నేపథ్యంలో కాస్త నెగిటివిటీ ఉంటుందని కొందరు అనుమానం వ్యక్తం చేశారు. కానీ ఆ నెగిటివిటీ ఏం లేదు. అన్ని ఏరియాల్లో కూడా ఈ సినిమా రికార్డ్ స్థాయి లో బిజినెస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా ఓవర్సీస్ రైట్స్ ని నిర్మాతలు అమ్మేశారనే వార్తలు వస్తున్నాయి.
ఇటీవల పెద్ద సినిమాలను కొనుగోలు చేసి ఓవర్సీస్ లో విడుదల చేస్తున్న సంస్థ దేవరను దాదాపుగా రూ.27 కోట్లకు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. తెలుగు తో పాటు ఇతర భాషల్లో కూడా దేవర విడుదల అవ్వబోతుంది. కనుక అన్ని భాషల రైట్స్ కి కలిపి ఈ మొత్తంను చెల్లించారట. అక్కడ 5 మిలియన్ డాలర్లను మించి వసూళ్లు చేయాల్సి ఉంటుంది.