Nayanthara: నయనతార (Nayanthara) ఆమె భర్త, దర్శకుడు విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan) వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ప్రారంభిస్తున్నట్టు విఘ్నేశ్ శివన్ తెలుపుతూ ట్వీట్ చేశారు.
‘ఈ ఆనంద క్షణాలను మీతో పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. ఆరేళ్ల మా కృషి, ప్రేమ ఈరోజు. మా వ్యాపారానికి సంబంధించిన అధికారిక ఖాతా “9SkinOfficial” ను ఎంతో గర్వంగా సంతోషంగా ప్రకటిస్తున్నాం. సెల్ఫ్ లవ్ ఎంతో ముఖ్యమని నమ్మాం. ఆ దిశగా మా ప్రయాణం ఈనెల 29 నుంచి ప్రారంభం కానుంది. ఆ రోజు నుంచే మీరు స్కిన్ కేర్ కు సంబంధించి మా ప్రొడక్ట్స్ ను మా అధికారిక వెబ్ సైట్ నుంచి కొనుగోళ్లు ప్రారంభించవచ్చ’ని తెలిపారు.
ఇందుకు సంబంధించిన ప్రమోషన్లను కూడా వారు ప్రారంభించారు. నయనతార స్వయంగా ఈ ప్రొడక్ట్స్ కు మోడల్ అయ్యారు. స్కిన్ కేర్ కు తగ్గట్టుగానే ఆమె లుక్స్ సంబంధిత యాడ్ లో ఆకట్టుకుంటున్నాయి. కెరీర్ పరంగా నయనతార జవాన్ విజయంలో ఉండగా విఘ్నేశ్ తన తదుపరి ప్రాజెక్టుపై దృష్టి పెట్టారు.
Today, we are extremely thrilled to reveal six years of relentless effort and love 🤎
We are proud & happy to introduce @9SkinOfficial ❤️❤️
Because we believe ..
Self-love is all we need. ✨The #9SKIN journey begins on the 29th of September, 2023
Prepare for an amazing… pic.twitter.com/8UFWr13thu
— VigneshShivan (@VigneshShivN) September 14, 2023