Rahul Gandhi: దేశంలో విపక్షాలన్నీ ఏకవవుతాయా.? నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా విపక్షాలు ఒక్కటైతే, రాహుల్ గాంధీ ఆ కూటమికి నాయకత్వం వహిస్తారా.? ఆయనే ప్రధాని అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో నిలబడతారా.? ఇలా చాలా ప్రశ్నలున్నాయ్.
పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ళ జైలు శిక్ష పడింది. దాన్ని పై కోర్టులో సవాల్ చేసుకునేందుకు వెసులుబాటు కూడా ఆయనకు కల్పించింది శిక్ష విధించిన న్యాయస్థానం. మరి, ఈలోగా లోక్ సభ కార్యాలయం ఎందుకు తొందరపడింది.? ఆయన మీద ఎందుకు అనర్హత వేటు వేసింది.
స్పీకర్ మీద ఈ విషయమై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు విపక్షాలు సిద్ధమవుతుండడం గమనార్హం. లోక్సభలో బీజేపీకి క్లియర్ మెజార్టీ వున్నా, స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం అంటే.. అది అత్యంత అవమానకరమైన సందర్భం. బీజేపీలో కూడా చాలామంది రాహుల్ మీద అనర్హత వేటుని తప్పు పడుతున్నారు.
పరువు నష్టం కేసుల్లో శిక్షలు పడటం అరుదు. శిక్ష పడినా, పై కోర్టుల్లో వెసులుబాటు దొరుకుతుంది. అది బీజేపీకి తెలియదని ఎలా అనుకోగలం.? బీజేపీ చేసిన ఈ తప్పిదం, విపక్షాల ఐక్యతకు కారణమవుతోంది. విపక్షాలు బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కటైతే మాత్రం, సమీప భవిష్యత్తులో బీజేపీకి దారుణమైన దెబ్బ రాజకీయంగా తగలనుందన్నది నిర్వివాదాంశం.
రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా వుండవ్. దేశంలో బీజేపీ ఉనికి కోల్పోయిన సందర్భాలూ వున్నాయి. పుంజుకున్న సందర్భమూ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా బీజేపీకి ఇప్పుడు తిరుగు లేదు. కానీ, ముందు ముందు ఉనికి కోల్పోయే పరిస్థితీ రావొచ్చు. అలాగే, కాంగ్రెస్ కూడా కొత్త ఉత్సాహంతో పుంజుకోవచ్చు.
అదే జరిగితే, కాంగ్రెస్ కొట్టే దెబ్బ బీజేపీకి వేరే లెవల్లో వుంటుంది. నరేంద్ర మోడీ సెల్ఫ్ గోల్ ముమ్మాటికీ రాహుల్ గాంధీకి రాజకీయంగా లాభమే.! అదెలా వుండబోతోందన్నది ముందు ముందు చూడాల్సిందే.
284518 799029Largest lover messages were created to share it along with your and gives honour of the bride and groom. Quite sound systems facing unnecessary throngs of folks ought to take into account each of our valuable concept of all presenting, which is ones trailer. finest man toasts 101379
988071 866150Hello there! Good post! Please inform us when all could see a follow up! 550730