Switch to English

నారా లోకేష్ వుండగా, టీడీపీకి వేరే శత్రువు అక్కర్లేదు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

తెలుగుదేశం పార్టీకి ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కంటే పెద్ద శతృవు ఇంకెవరుంటారు.? ఈ చర్చ టీడీపీ వర్గాల్లోనే జరుగుతోందిప్పుడు.! టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు నానా తంటాలూ పడి, జనసేన పార్టీతో పొత్తుకి గ్రౌండ్ క్లియర్ చేశారు.! కానీ, ఆ పొత్తుని చెడగొట్టే దిశగా నారా లోకేష్ పావులు కదుపుతున్నట్టుంది.

తెలిసి మాట్లాడుతున్నాడో తెలియక మాట్లాడుతున్నాడోగానీ, ‘చంద్రబాబే కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి’ అని నారా లోకేష్ చేస్తున్న ప్రకటనతో, జనసేన శ్రేణులు తీవ్ర అసహనానికి గురవుతున్నాయి.

రెండు రాజకీయ పార్టీల మధ్య పొత్తుకు సంబంధించి అధికారిక ప్రకటన, ఇరు పార్టీల అధినేతల నుంచి రావాలి. ‘జనసేనతో పొత్తుకు సిద్ధంగా వున్నాం’ అని చాలాకాలం క్రితమే టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. తెలుగుదేశం పార్టీతో కలిసి పయనించబోతున్నాం.. అని కొన్నాళ్ళ క్రితమే జనసేన అధినేత వెల్లడించారు.

మధ్యలో నారా లోకేష్ ఎవరు.? టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడైనంతమాత్రాన, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో వున్నంత మాత్రాన.. పొత్తులకు సంబంధించి ఇలా ఏకపక్షంగా లోకేష్.. కీలక ప్రకటన చేసేస్తారా అన్నది సర్వత్రా వినిపిస్తోన్న వాదన.

‘ముఖ్యమంత్రి ఎవరు అవ్వాలన్నది ఎన్నికల్లో గెలిచే సీట్లను బట్టి ఆధారపడి వుంటుంది..’ అని గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు, అదే మాటకు ఆయన కట్టుబడి వున్నారు. చంద్రబాబు కూడా, ‘నేనే ముఖ్యమంత్రి అభ్యర్థిని’ అని జనసేనతో పొత్తు అనంతరం వ్యాఖ్యానించిన సందర్భాల్లేవు.

పొత్తు కుదిరి, కింది స్థాయిలో ఇరు పార్టీల శ్రేణులు కలిసి పని చేస్తున్న తరుణంలో, ‘చంద్రబాబే ముఖ్యమంత్రి అభ్యర్థి’ అని పదే పదే నారా లోకేష్ చేస్తున్న ప్రకటనలతో, తీవ్ర గందరగోళం ఏర్పడింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ విషయమై స్పందించాల్సి వుంది. అంతకన్నా ముందు, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, తన కుమారుడ్ని కంట్రోల్‌లో పెట్టుకోవాలన్నది జనసేన శ్రేణుల నుంచి వస్తున్న స్వీట్ వార్నింగ్.

లేదూ, చంద్రబాబు ఇలాగే వ్యవహారాన్ని సాగదీస్తే, ఇరు పార్టీల శ్రేణులకూ తప్పుడు సంకేతాలు వెళతాయి. తద్వారా ఓటు షేరింగ్ ఇరు పార్టీల మధ్యా కష్ట సాధ్యమవుతుంది. అదే జరిగితే, పొత్తు వల్ల ఇరు పార్టీలకూ ప్రయోజనం వుండదు.

కూటమి విఫలయత్నంగా మారితే, అందుకు పూర్తి బాధ్యత నారా లోకేష్ తీసుకోవాల్సిన పరిస్థితి రావొచ్చు. అప్పటికి నష్టం జరిగిపోతుంది గనుక, టీడీపీ కాలగర్భంలో కలిసిపోవడానికి నారా లోకేష్ కారకుడవుతాడు. అసలు, ఇంతటి డ్యామేజ్ జరగడానికి, నారా లోకేష్ నోటి దురద మాత్రమే కారణమా.? వ్యూహాత్మకంగానే లోకేష్ ఆ నోటి దురద ప్రదర్శించాడా.? ఏమో, చంద్రబాబు ఈ వ్యవహారాన్ని ఎలా డీల్ చేస్తారో ఏమో.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన...

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు...

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

రాజకీయం

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట.! వైసీపీ ఉవాచ.!

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడిపోతారు.? ఈపాటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఓటరు తీర్పు నిక్షిప్తమైపోయింది. జాతకాలు జూన్ 4న తేలుతాయ్.! అంటే, జడ్జిమెంట్‌కి సంబంధించి తీర్పు రాసేయబడింది.. అది వెల్లడి కావాల్సి వుందంతే. కానీ,...

కింగ్ మేకర్ జనసేనాని: వైసీపీ అంతర్గత సర్వేల్లో ఇదే తేలిందా.?

టీడీపీ - వైసీపీకి సమానంగా సీట్లు రావొచ్చు. జనసేన పార్టీకి తక్కువలో తక్కువ పన్నెండు సీట్లు వస్తాయ్.! రెండు ఎంపీ సీట్లు కూడా జనసేన గెలుచుకోబోతోంది. ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్...

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

జగన్, చంద్రబాబు.. విదేశీ ‘రాజకీయ’ పర్యటనల వెనుక.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. నారా చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం వుందట. విదేశాలకు వెళితే తప్పేముంది.? ఒకరు విదేశాలకు వెళితే, పారిపోయినట్టు...

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

ఎక్కువ చదివినవి

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.. మాస్ లో క్రేజ్.. వీటన్నింటి గురించి...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...