రౌడీ హీరో క్రేజ్ .. రోజు రోజుకు రెట్టింపవుతుంది. అతని క్రేజ్ ఒక్క టాలీవుడ్ కె పరిమితం కాలేదు .. ఇప్పుడు కోలీవుడ్, బాలీవుడ్ లలో కూడా విజయ్ అంటే ఓ రేంజ్ క్రేజ్. ప్రస్తుతం విజయ్ బాలీవుడ్ ఎంట్రీ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ముంబై లో విజయ్ చక్కర్లు కొడుతున్నాడు కూడా. విజయ్ ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో బ్రేక్ అప్ అనే సినిమా చేస్తున్నాడు. ఇంకా టైటిల్ ని అధికారికంగా ప్రకటంచలేదు. ఈ సినిమా తరువాత అటు పూరి జగన్నాధ్ తో మరో సినిమాకు కమిట్ అయ్యాడు విజయ్. ఫైటర్ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కనుందని టాక్.
ఈ రెండు సినిమాలతో పాటు విజయ్ సినిమా చేయడానికి ఓకే చెప్పాడని టాక్. ఆ సినిమా చేసేది ఎవరో కాదు హీరో విజయ్ ని లైమ్ లైట్ లోకి తెచ్చిన దర్శకుడు నాగ్ అశ్విన్. మహానటి సినిమాతో నాగ్ అశ్విన్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. మహానటి తరువాత ఈ దర్శకుడు నెక్స్ట్ సినిమాను ఇంత వరకు ప్రకటించలేదు, అయితే అయన తదుపరి చిత్రాన్ని విజయ్ తో చేస్తాడని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన స్క్రిప్ట్ కూడా లాక్ చేసాడని టాక్ !
Also Read: పిక్చర్ పెర్‌ఫెక్ట్: రౌడీ హీరోతో రాకింగ్ బ్యూటీ
మహానటి సినిమాలో విజయ్ హీరోగా నటించాడు. అంతకు ముందు ఎవడె సుబ్రహ్మణ్యం సినిమాతో విజయ్ దేవరకొండ కెరీర్ కి పునాది వేసాడు నాగ్. ఇప్పడు అతగాడితో నెక్స్ట్ సినిమా చేస్తున్నాడు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కే ఈ సినిమా ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుపుకుంటుంది. వైజయంతి బ్యానర్ కు ఎప్పుడో కమిట్మెంట్ ఇచ్చాడు విజయ్. ఇప్పుడు ఆ కమిట్మెంట్ ప్రకారం నాగ్ అశ్విన్ తో సినిమా సెట్స్ పైకి రానుంది. సో త్వరలోనే దీనికి సంబందించిన అధికారిక ప్రకటన రానుంది.
