తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ కు తెలుగులో కూడా ఫ్యాన్స్ బాగానే ఉన్నారు. ఈ స్టార్ హీరోపై ప్రముఖ సంగీత దర్శకుడు డి.ఇమాన్ ఒక ఇంటర్వ్యూలో సంచలన ఆరోపణలు చేసాడు. శివ కార్తికేయన్ కెరీర్ మొదట్లో ఇమాన్ సంగీత దర్శకుడిగా చేసిన రజినీ మురుగన్ వంటి చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. మ్యూజికల్ గానూ మెప్పించాయి. అయితే ఆ తర్వాత ఇద్దరూ కలిసి పనిచేయలేదు.
ఈ విషయమే ఇమాన్ ను ఒక ఇంటర్వ్యూలో అడగ్గా ఈ జన్మలో శివతో కలిసి పనిచేసే అవకాశం లేదని తేల్చి చెప్పేసాడు. వచ్చే జన్మలో కుదురుతుందేమో చూడాలి అన్నాడు.
అసలు విషయం స్ట్రెయిట్ గా చెప్పకుండా శివ కార్తికేయన్ తనకు ద్రోహం చేసాడు అన్నట్లుగా మాట్లాడాడు ఈ సంగీత దర్శకుడు. కలిసి పనిచేద్దామని చెప్పి మాట తప్పినట్లుగా చెప్పాడు. అదేంటి అని అడిగితే శివ కార్తికేయన్ సమాధానం విని షాక్ అయ్యాడట. అదేంటి అన్నది కూడా తాను చెప్పలేనని అన్నాడు. మరి అంతలా వీరిద్దరికీ ఏం చెడిందో ఏమో.
I would like to thank you for the efforts you have put in writing this blog.
I’m hoping to check out the same high-grade content by you
later on as well. In fact, your creative writing abilities has motivated me
to get my very own blog now 😉