Switch to English

రాజమండ్రి అభివృద్ధి: వైసీపీ ఎంపీ ఎవర్ని ర్యాగింగ్ చేస్తున్నట్టు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన యువ నేత, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, సోషల్ మీడియా వేదికగా ఓ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. ‘రాజమండ్రి అభివృద్ధి’ అంటూ వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫొటోతో పలు అంశాల్ని అందులో పేర్కొన్నారు. వాటిల్లో అతి ముఖ్యమైనది ‘ఔటర్ రింగ్ రోడ్డు’. ఈ దెబ్బకి రాజమండ్రి లోక్ సభ నియోజకవర్గ ప్రజలకు ఒక్కసారిగా షాక్ తగిలింది.

అంతేనా, అందులో చాలా అద్భుతాలున్నాయి. ప్రపంచ స్థాయి రోడ్లు.. వరల్డ్ క్లాస్ సిటీ.. చెప్పుకుంటూ పోతే ఒకటా.? రెండా.? బోల్డన్ని వున్నాయ్. అన్నట్టు, ఇంకో అద్భుతం కూడా వుందండోయ్.. అదే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం. ఇవన్నీ ఎక్కడున్నాయ్.? అని మాత్రం అడక్కండి. కావాలంటే, రాజమండ్రి వెళ్ళి చూసుకోండి. రాజమండ్రి విమానాశ్రయంలో కొత్త కార్గో టెర్మినల్ దగ్గర్నుంచి, రాజమండ్రి రైల్వే స్టేషన్‌లో కొత్తగా 4, 5 ప్లాట్‌ఫారంల అంశం వరకు.. ఏదీ వదలకుండా అన్నిటినీ అందులో పొందుపరిచేశారు ఎంపీ మార్గాని భరత్.

‘వైసీపీ గ్రామ సింహాలు..’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైసీపీ ప్రభుత్వ వైఫల్యాల గురించి పేర్కొంటూ ఇటీవల ఓ ట్వీట్ చేసిన విషయం విదితమే. దానికి కొనసాగింపుగా మరో ట్వీట్ కూడా వేశారు పవన్ కళ్యాణ్. వాటికి సమాధానంగా వైసీపీ నుంచి ఇప్పుడు మార్గాని భరత్ రామ్ ఇలా ట్వీట్ వేశారా.? లేదంటే, తన నియోజకవర్గ పరిధిలోని ఓ వైసీపీ ఎమ్మెల్యే తనకు ఎదురు తిరగడం.. ఈ క్రమంలో నడిచిన పంచాయితీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చీవాట్లతో.. మార్గాని భరత్ మనసు మార్చుకుని.. అధికార పార్టీని ‘ట్రోలింగ్’ చేస్తున్నారా.? అన్నది తేలాల్సి వుంది.

లేకపోతే, రాజమండ్రిలో రింగ్ రోడ్డు ఏంటి.? రాజమండ్రిలో అంతర్జాతీయ విమానాశ్రయమేంటి.? గట్టిగా వర్షం కురిస్తే.. రాజమండ్రిలో చాలా ప్రాంతాలు మునిగిపోతున్నాయి. ట్రాఫిక్ అస్తవ్యస్థం. ప్రపంచ స్థాయి రోడ్లు వున్నాయా.? అసలు రోడ్లున్నాయా రాజమండ్రిలో.. అనే సందేహం వాహనదారులకు కలుగుతుంటేనూ.!

నో డౌట్, ఎమ్మెల్యే – ఎంపీ మధ్య ఆధిపత్య పోరులో భాగంగా అధికార పార్టీని భరత్ రామ్ ట్రోల్ చేసేందుకే ఈ ట్వీటేశారని అనుకోవాలేమో. అంతేనా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్టోబర్ 2న రాజమండ్రిలో శ్రమదానం చెయ్యనున్న దరిమిలా.. ఆదిరిపడుతూ భరత్ రామ్ ఈ పబ్లిసిటీ స్టంటుకి తెరలేపారా.?

6 COMMENTS

  1. అయ్యో ఎంపీ గారూ మీ ట్వీట్ లో “రాజమండ్రి మెట్రోరైలు, రాజమండ్రి-తాడేపల్లి బుల్లెట్ రైలు, రాజమండ్రి ఒలంపిక్సు సిటీ” లు మర్చిపోయారు. మళ్ళీ ఫ్రెష్ గా కొత్త ట్వీట్ పెట్టండి గాంధీ జయంతి స్పెషల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...