Switch to English

అక్క‌డ ఇక్క‌డ బిజెపి ఉండాలిః మోడీ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

ఏపీలో మంచి పాలన కావాలంటే ఏప్రిల్‌ 11న జరిగే ఎన్నికల్లో బిజెపికి ఓటువేసి గెలిపించాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరారు. మంచి పాల‌న అంటే కేంద్ర రాష్ట్రాల్లో బిజెపి ప్రభుత్వం ఉండాలని ఆయన వివరించారు. కర్నూలులో నిర్వహించిన ఎన్నికల ప్రచారసభలో ఆయ‌న మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అభివృద్ధిలో కేంద్రానికి ఏపీ ప్రభుత్వం సహకరించట్లేదని మోదీ ఆరోపించారు.

‘‘స్వాతంత్య్రం వచ్చాక మొదటిసారి ఒక ప్రధాని కర్నూలుకు వచ్చారు. ఈ అదృష్టం నాకే కలిగింది. 2019 ఎన్నికల్లో విజయ సంకల్ప దీక్షతోపాటు కృతజ్ఞతలు చెప్పేందుకు మీ ముందుకు వచ్చా. ఐదేళ్ల క్రితం మీరు నాకు వేసిన ఓటు వల్ల మీకు ప్రధాన సేవకుడిగా మారాను. ఐదేళ్లు పగలు, రాత్రి నిద్రాహారాలు మాని పని చేశా. ఈ చౌకీదార్‌ ఐదేళ్లలో ఏపీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అన్ని విధాలా పని చేశారు.

నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేస్తాను. మొదటి మంత్రివర్గ సమావేశంలో పోలవరానికి అనుమతులు ఎవరు మంజూరు చేశారు? అనంతపురంలో మొదటి కేంద్రీయ విద్యాలయం ఎవరిచ్చారు? కర్నూలులో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌, సోలార్‌ పవర్‌ పార్క్‌ ఎవరిచ్చారు? విశాఖ రైల్వే జోన్‌ ఎవరిచ్చారు? ఏపీ మొదటి ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఎం, ఎయిమ్స్‌ ఎవరిచ్చారు? మొదటి గిరిజన విశ్వవిద్యాలయం, విపత్తు నిర్వహణ సంస్థ, ఐఐపీ, ఐఐఎఫ్‌టీ, ఐఐపీ, ఎన్‌ఐఓటీ ఎవరిచ్చారు?. విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, రాజమండ్రి, కడప విమానాశ్రయాల విస్తరణ ఎవరు చేశారు? మీ కోసం ఈ చౌకీదార్‌ ఇవన్నీ చేశారు’’ అని మోడీ అన్నారు.

‘‘ఏపీలో కేంద్రం చేపట్టే కొత్త కార్యక్రమాలతో ఇక్కడి యువత బంగారు భవిష్యత్తుపై భద్రత ఏర్పడింది. ఎక్కువ పనులు చేసేందుకు కావాల్సిన ఆలోచనలు నా వద్ద ఉన్నాయి. కానీ, ఇక్కడి ప్రభుత్వం సహకరించట్లేదు. రాబోయే ఏప్రిల్‌ 11న బిజెపికి వేసే ఓటు వల్ల ఉదయించే ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడుతుంది. ఏపీకి సూర్యోదయం కావాలా వద్దా? అని ప్ర‌శ్నించారు. ఈ రాష్ట్రంలో ప్రతి పనీ అవినీతిమయం. ఈ చౌకీదార్‌ మీ రక్షకుడు.

ఈ ప్రభుత్వానికి లెక్కలు అడిగితే ముఖ్యమంత్రి యూ టర్న్‌ తీసుకున్నారు. తన రాజకీయ స్వార్థం కోసం తన అసమర్థతను కప్పి పుచ్చుకొనేందుకు అబద్ధాలు చెబుతున్నారు. పొలవరం త్వరగా పూర్తి కావాలని కేంద్ర ప్రభుత్వం రూ.7 వేల కోట్లు విడుదల చేసింది. పాలకులకు చిత్తశుద్ధి లేకపోవడం వల్ల పనులు పూర్తి కాని పరిస్థితి ఉంది. కేంద్రం నుంచి వచ్చే పథకాలకు తమ స్టిక్కర్‌ అతికించుకుని తమవని చెప్పుకుంటున్నారు. అందుకే సీఎం చంద్రబాబు స్టిక్కర్‌ బాబు అయ్యారు’’ అంటూ మోడీ దుయ్య‌బ‌ట్టారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Devara: ‘బడా నిర్మాత బడాయి కబుర్లు..’ దేవర పాటకు నెటిజన్స్ ట్రోలింగ్

Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr Ntr) హీరోగా తెరకెక్కుతున్న భారీ సినిమా దేవర (Devara). ఇటివలే ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా సినిమాలో ఫియర్...

Taapsee: డెలివరీ బాయ్ నిబద్ధత.. స్టార్ హీరోయిన్ ఎదురైనా పనిలోనే.. వీడియో...

Taapsee: సినిమా తారలంటే ఎప్పుడూ క్రేజే. తెరపై అలరించేవారు బయట ఎదురైతే ఉబ్బితబ్బిబ్బవుతాం. వెంటనే మొబైల్ తీసి సెల్పీల కోసం ప్రయత్నిస్తాం. స్టార్ హీరో, హీరోయిన్లైతే...

Jabardasth Faima: లవర్ ని పరిచయం చేసిన జబర్దస్త్ ఫైమా.. షాక్...

Jabardasth Faima: జబర్దస్త్ వేదికగా పైమా-ప్రవీణ్ కలిసి చేసిన స్కిట్స్ నవ్వులు పంచాయి. వీరిద్దరూ నిజజీవితంలోనూ ప్రేమలో ఉన్నారని ప్రచారం కూడా జరిగింది. ఇద్దరూ కలిసి...

Vijay Devarakonda : రౌడీస్టార్‌, సుకుమార్‌ కాంబో కొత్త అప్‌డేట్‌

Vijay Devarakonda : రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది అంటూ నాలుగు సంవత్సరాల క్రితం అధికారికంగా ప్రకటన...

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన...

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు...

రాజకీయం

ఏపీ ఎన్నికల సిత్రమ్: తన మీద తానే బెట్టింగ్ వేసుకున్నాడట.!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల బెట్టింగ్ అనేది ట్రెండ్ సెట్టింగ్ వ్యవహారంలా మారిపోతోంది. దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలకు సంబంధించి బెట్టింగ్ జరగడమనేది సర్వసాధారణమే అయిపోయిందిప్పుడు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలోనూ బెట్టింగ్...

వైసీపీ ఆ 95 చోట్ల ఓడిపోనుందట.! ఈ లెక్క పక్కా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసి వారం రోజులపైనే వుంది. అసెంబ్లీతోపాటు లోక్ సభ నియోజకవర్గాలకూ పోలింగ్ పూర్తయ్యింది. ఎవరు గెలుస్తారన్నది జూన్ 4న తేలుతుంది. అయితే, ఎన్నికల ఫలితాల వెల్లడికి...

రేణు దేశాయ్‌ని సోషల్ మీడియాలో కెలుకుతున్నదెవరు.?

సినీ నటి రేణు దేశాయ్ పేరు మరోమారు వార్తల్లోకెక్కింది.! ఆమె తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేసిన ఓ ‘స్టోరీ’ ఆమెను వార్తల్లోకెక్కించింది. పెంపుడు జంతువుల సంరక్షణ విషయమై రేణు...

జూన్ 4న ఆంధ్ర ప్రదేశ్‌లో ఏం జరగబోతోంది.?

ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తాయ్.! మధ్య మధ్యలో ఉప ఎన్నికలు కూడా రావొచ్చు.! ఎన్నికలంటేనే ఓ ప్రసహనం. మామూలుగా అయితే, రాజకీయం అంటే సేవ.! కానీ, రాజకీయమంటే ఇప్పుడు కక్ష సాధింపు వ్యవహారం.! ఐదేళ్ళుగా ఆంధ్ర ప్రదేశ్...

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట.! వైసీపీ ఉవాచ.!

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడిపోతారు.? ఈపాటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఓటరు తీర్పు నిక్షిప్తమైపోయింది. జాతకాలు జూన్ 4న తేలుతాయ్.! అంటే, జడ్జిమెంట్‌కి సంబంధించి తీర్పు రాసేయబడింది.. అది వెల్లడి కావాల్సి వుందంతే. కానీ,...

ఎక్కువ చదివినవి

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట.! వైసీపీ ఉవాచ.!

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడిపోతారు.? ఈపాటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఓటరు తీర్పు నిక్షిప్తమైపోయింది. జాతకాలు జూన్ 4న తేలుతాయ్.! అంటే, జడ్జిమెంట్‌కి సంబంధించి తీర్పు రాసేయబడింది.. అది వెల్లడి కావాల్సి వుందంతే. కానీ,...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ తనయుడిగా బాలనటుడిగా తెరంగేట్రం చేసి తొలి...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

Devara: ‘బడా నిర్మాత బడాయి కబుర్లు..’ దేవర పాటకు నెటిజన్స్ ట్రోలింగ్

Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr Ntr) హీరోగా తెరకెక్కుతున్న భారీ సినిమా దేవర (Devara). ఇటివలే ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా సినిమాలో ఫియర్ సాంగ్ అని విడుదల చేశారు. అయితే.....