Miss Shetty Mr Polishetty : జాతిరత్నాలు హీరో నవీన్ పొలిశెట్టి, అనుష్క ముఖ్య పాత్రల్లో రూపొందిన ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమా విడుదల విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ ఏడాది ఆరంభం నుండి ఇప్పటి వరకు రిలీజ్ విషయంలో దోబూచులాట జరుగుతున్న నేపథ్యంలో అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఆ మద్య ఈ సినిమాను ఆగస్టు 4వ తారీకున విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించిన యూవీ క్రియేషన్స్ వారు ఇప్పుడు ఆ తేదీకి విడుదల చేయడం లేదు. తాజాగా ఈ సినిమా కొత్త విడుదల తేదీ విషయంలో కొత్త పుకారు షికారు చేస్తోంది. ఇంకా కొత్త విడుదల తేదీ కన్ఫర్మ్ అవ్వలేదు కానీ పుకార్లు తెగ హడావిడి చేస్తున్నాయి.
ఆగస్టు నెలలోనే 18వ తారీకు లేదా 25వ తారీకున సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి రిలీజ్ ఈ నెలలో అయినా ఉంటుందా మళ్లీ వాయిదా పడుతుందా అంటూ నెటిజన్స్ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. మహేష్ బాబు పి దర్శకత్వంలో ఈ సినిమాను వంశీ ప్రమోద్ లు యూవీ క్రియేషన్స్ లో నిర్మించారు.
Passion the website– really user friendly and lots to see! [url=http://heungil.net/bbs/board.php?bo_table=free&wr_id=2098063]amlodipine sans ordonnance en Belgique[/url]