బిగ్ బాస్ తో మంచి గుర్తింపు దక్కించుకున్న మెహబూబ్ అండ్ బ్యాక్ ఈమద్య కాలంలో సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్న విషయం తెల్సిందే. ఇటీవల మెహబూబ్ అండ్ టీమ్ వైల్డ్ డాగ్ సినిమా చూస్తున్న సమయంలో షాకింగ్ సంఘటన జరిగిందట. వైల్డ్ డాగ్ సినిమాలో బిగ్ బాస్ ఫేమ్ అలీ రెజా నటించిన విషయం తెల్సిందే. అలీ రెజా అండ్ ఫ్రెండ్స్ తో కలిసి మెహబూబ్ అండ్ ఫ్రెండ్స్ వైల్డ్ డాగ్ సినిమాను చూసేందుకు వెళ్లారట. ఆ సమయంలో చిన్నపాట గందరగోళ వాతావరణం ఏర్పడినట్లుగా చెప్పుకొచ్చాడు.
వైల్డ్ డాగ్ లో అలీ రెజా అన్న కనిపించిన వెంటనే మేము అంతా కూడా గట్టిగా మొత్తుకున్నాం. ఆ సమయంలో థియేటర్ల ఉన్న వారు చాలా మంది మా వైపు కోపంగా చూశారు. అయినా కూడా మేము పట్టించుకోకుండా గట్టిగా అరుస్తూనే ఉన్నాం. ఇంటర్వెవల్ సమయంలో ఒక ఆంటీ మా వద్దకు సీరియస్ గా వచ్చింది. మేము మాస్క్ లు తీసిన వెంటనే ఓహ్ మీరా అంటూ కూల్ అయ్యారు. ఆమె స్పీడ్ చూస్తే కొట్టేంతగా అనిపించింది అంటూ థియేటర్ ఎక్స్ పీరియన్స్ ను మెహబూబ్ షేర్ చేసుకున్నాడు.
790316 562727Some genuinely excellent weblog posts on this internet site , regards for contribution. 963538
774530 536466This internet web page is genuinely a walk-through for all of the info you wanted about this and didnt know who to ask. Glimpse here, and you will surely discover it. 52571