సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు డబ్బింగ్ ముగించుకుని ఫ్యామిలీతో కలిసి హాలిడే ట్రిప్ కు లండన్ చెక్కేస్తున్న సంగతి తెల్సిందే. ముందుగా పర్సనల్ పని మీద ముంబై వెళ్లిన మహేష్ అండ్ ఫ్యామిలీ అటు నుండి లండన్ వెళతారు. అక్కడే కొత్త సంవత్సర వేడుకలను జరుపుకోనున్నారు. ఇక మహేష్ బాబు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేది తక్కువే.
కేవలం తన సినిమాల ప్రమోషన్ కు, ఏదైనా సినిమా తనకు నచ్చినప్పుడు సోషల్ మీడియాను వాడటానికి మాత్రమే మహేష్ బాబు తన అకౌంట్ ను వాడుతుంటాడు. ఐతే మహేష్ భార్య నమ్రత మాత్రం ఇన్స్టాలో భలే యాక్టివ్ గా ఉంటుంది. మహేష్ కు సంబంధించిన విషయాల్ని, తన ఇంటి సంగతులను వివరిస్తుంది నమ్రత.
లేటెస్ట్ గా నమ్రత, మహేష్ డబ్బింగ్ స్టూడియోను పరిచయం చేసింది. జూబ్లీ హిల్స్ లోని తన ఇంట్లో మహేష్ బాబు సొంతంగా డబ్బింగ్ స్టూడియో సెటప్ చేసుకున్నాడు. అది చూస్తుంటేనే కళ్ళు తిరగాల్సింది. అంత పోష్ గా ఉంది. అత్యంత ఆధునిక టెక్నాలజీతో ఇది సెటప్ చేసుకున్నట్లు తెలుస్తోంది. తన సినిమాల డబ్బింగ్ కు వేరే ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా మహేష్ ఈ ఏర్పాటు చేసుకున్నాడు. సరిలేరు నీకెవ్వరు డబ్బింగ్ ఈ స్టూడియోలోనే చెప్పుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం లండన్ ట్రిప్ వెళుతున్న మహేష్, జనవరి 3కి తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నాడు. ఆ తర్వాత సరిలేరు నీకెవ్వరు ప్రమోషన్స్ తో ఫుల్ బిజీ కానున్నాడు. జనవరి 11న సరిలేరు నీకెవ్వరు విడుదల కానుంది.
621101 670113I believe this internet site has some rattling amazing information for everybody : D. 912043
946141 12890You created some initial rate factors there. I seemed on the internet for the difficulty and located most people will go along with together along with your website. 576228
627927 533515But wanna admit that this is extremely helpful , Thanks for taking your time to write this. 92264