Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా ఈ సంక్రాంతి కానుకగా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. సినిమా కి సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుకను గుంటూరు లో భారీ ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూపర్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా మహేష్ బాబు మాట్లాడుతూ.. తనకు త్రివిక్రమ్ కు ఉన్న స్నేహం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ రెండేళ్లు ఆయన నాకు ఇచ్చిన బలం అంతా ఇంతా కాదు అన్నాడు. త్రివిక్రమ్ కి కృతజ్ఞతలు తెలియజేసిన మహేష్ బాబు హీరోయిన్ శ్రీలీల పట్ల చాలా ఆనందం వ్యక్తం చేశాడు.
తెలుగు అమ్మాయి శ్రీలీల హీరోయిన్ గా ఈ స్థాయికి రావడం చాలా ఆనందంగా ఉంది. ఆమెతో డాన్స్ చేయడం మామూలు విషయం కాదు. వామ్మో అదేం డాన్స్… హీరోలందరికీ తాటూడిపొద్ది అంటూ మహేష్ బాబు ఆమె డాన్స్ పై ఆసక్తికర కామెంట్స్ చేయడం జరిగింది. మొత్తానికి శ్రీలీల కి ఈ సినిమా మరో ధమాకా హిట్ ను ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.