సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా భారీ అంచనాల మధ్య వచ్చిన మహర్షి సినిమా మొదటి షో నుండి మిక్సడ్ టాక్ తెచ్చుకుంది. నిజానికి ఒకరోజు ముందే ఓవర్ సీస్ లో ప్రీమియర్ షోస్ పడ్డాయి. దాదాపు ఏడాది కాలంగా ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూడాలా అంటూ మహేష్ ఫాన్స్ తెగ క్యూరియాసిటీ పెంచుకున్నారు. అలా భారీ అంచనాలతో పాటు మహేష్ కెరీర్ లో 25 సినిమాగా ల్యాండ్ మార్క్ మూవీ గా వచ్చిన ఈ సినిమా ఓవర్సీస్ లో 2500 కు పైగా ప్రీమియర్ షోలను వేశారు. టాలీవుడ్ చరిత్రలోనే అత్యంత భారీ ప్రీమియర్ షో లు పడ్డ సినిమా ఇదే. అదికూడా నాన్ బాహుబలి కేటగిరి కింద.
ప్రీమియర్ షో ద్వారా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ షోస్ పడుతున్న కొద్దీ ఆ పాజిటివ్ టాక్ మారిపోయింది. ఈ సినిమా 200 లొకేషన్స్ లో ప్రీమియర్స్ వేస్తె 455,060 డాలర్స్ వసూలు చేసింది. ఈ ఏడాది అత్యధిక భారీ ఓపెనింగ్స్ అందుకున్న సినిమా ఇదే. అయితే మహేష్ గత సినిమాలను పరిశీలిస్తే .. ఈ రికార్డ్ పెద్ద గొప్పేమి కాదనే టాక్ వినిపిస్తుంది.
ఎందుకంటే మహేష్ స్పైడర్, ఆగడు సినిమాల రికార్డును కూడా ఈ సినిమా చేయలేదని అంటున్నారు. స్పైడర్ 1,005,000 మిలియన్ డాలర్స్ వసూలు చేస్తే ఆగడు 524,087 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది. ఇక మహేష్ ఓవర్ సీస్ హయ్యెస్ట్ ఓపెనింగ్ రాబట్టిన సినిమా స్పైడర్. ఈ లెక్కన మహర్షి రేంజ్ కంటే ఆగడు, స్పైడర్ ఓపెనింగ్స్ ఎక్కవ. ఇక ఇండియాలో కూడా ఈ సినిమా పై మిక్సడ్ టాక్ రావడం విశేషం.