సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన మహర్షి సినిమా ఇటీవలే విడుదలై డివైడ్ టాక్ తో దూసుకుపోతుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన వీకెండ్ లో భారీ వసూళ్లను రాబట్టి మహేష్ కెరీర్ లో మరో హయ్యెస్ట్ రెవెన్యూ కలెక్ట్ చేసిన సినిమాగా నిలిచింది. కేవలం 4 రోజులకే 100 కోట్ల క్లబ్ లో చేరినట్టు యూనిట్ ప్రకటించింది. నిజంగా మహేష్ కెరీర్ లో హయ్యెస్ట్ వసూళ్లు మహర్షి వే. అయితే సోమవారం నుండి మహార్షి వసూళ్లు కాస్త తగ్గాయి. మొదట్లో ఉన్న స్పీడ్ ని మహర్షి నెక్స్ట్ వీక్ అందుకునే దిశలో లేదు. మరి మొదటి వీకెండ్ లో మహర్షి వసూళ్లు ఉన్నాయో చూద్దాం. మహర్షి 4 రోజుల వసూళ్లు ( షేర్ లలో )
నైజాం – 16 . 60 కోట్లు,
సీడెడ్ – 5. 30 కోట్లు,
కృష్ణా – 3. 62 కోట్లు,
నెల్లూరు – 1. 75 కోట్లు,
గుంటూరు -5. 90 కోట్లు,
వైజాగ్ – 6. 25 కోట్లు,
ఈస్ట్ – 4. 84 కోట్లు,
వెస్ట్ – 3. 75 కోట్లు,
మొత్తంగా – 48. 04 కోట్లు ..
ఇక ఓవర్ సీస్ లో నాలుగు రోజులకు 1. 4 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది. ఇదే వేగంతో కొనసాగితే 2 మిలియన్ ను రీచ్ అవ్వడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.