రాములమ్మ .. రీ ఎంట్రీ కి రంగం సిద్ధమైంది. దాదాపు 17 ఏళ్ల గ్యాప్ తరువాత రీ ఎంట్రీ ఇస్తుంది. తెలుగు తెరపై లేడీ అమితాబ్ గా స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న విజయశాంతి, హీరోలతో సమానంగా బాక్స్ ఆఫీస్ వద్ద విజయాలను అందుకుంది. తాజాగా ఆమె సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుందట. మహర్షి విజయంతో మంచి జోరుమీదున్న మహేష్ నెక్స్ట్ సినిమాను అనిల్ రావిపూడితో చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ తో పాటు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా జూన్ 15న సెట్స్ పైకి రానుంది.
అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా పూర్తీ స్థాయి ఫ్యామిలి ఎంటర్ టైనర్ గా ఉన్నటుందట. ఇందులో ఓ కీ రోల్ కోసం మాజీ హీరోయిన్ విజయశాంతిని అడిగారట. కథ నచ్చడంతో సినిమా చేయడానికి ఆమె ఓకే చెప్పిందట, కానీ రెమ్యూనరేషన్ విషయంలోనే ఆమె ఎక్కడ తగ్గడం లేదట. అప్పట్లోనే హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకునే విజయశాంతి ఇప్పుడు రీ ఎంట్రీ కోసం కూడా భారీగానే డిమాండ్ చేస్తుందట. ఈ విషయంలో ఎక్కడ తగ్గేది లేదని చెప్పిందట.
ప్రస్తుతం దర్శక నిర్మాతలు ఆమెతో చర్చలు జరుపుతున్నారు. హీరోయిన్ గా సినిమాలు మానేసిన విజయశాంతి కొంత గ్యాప్ తరువాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న విజయశాంతి మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే విషయంలో చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయితే సరైన కథ కోసమే ఆమె వెయిట్ చేసిందట. అన్నట్టు ఈ సినిమాలో మహేష్ అత్త పాత్ర కోసమే ఆమెను సంప్రదిస్తున్నట్టు తెలిసింది. మహేష్ 26వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబందించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.