శాసన మండలి రద్దుకి సంబంధించి రేపే కీలకమైన రోజు. రేపు ఉదయం ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ భేటీ కాబోతోంది. ఈ భేటీలోనే మండలి రద్దుపై నిర్ణయం తీసుకుంటారన్న ప్రచారం జరుగుతోంది. ‘ఎమ్మెల్సీలను లాగేద్దాం..’ అని వైసీపీ ముఖ్య నేతలు అధినేత వైఎస్ జగన్‌కి చెబుతోంటే, జగన్ మాత్రం.. అందుకు ససేమిరా అంటున్నారట. ‘నన్ను కూడా చంద్రబాబులా తయారవమంటారా.?’ అంటూ జగన్ తమను ప్రశ్నించారంటూ వైసీపీ నేతలు లీకులు పంపుతుండడం గమనార్హం.
నిజానికి, పార్టీ ఫిరాయింపుల వ్యవహారానికి గట్టిగా తెరలేపింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే. వైఎస్ మరణానంతరం జరిగిన వ్యవహారమది. అక్కడిదాకా ఎందుకు.? టీడీపీ ఎమ్మెల్సీ పోతులు సునీత ఇటీవల వైసీపీలోకి ఎలా చేరిపోయారు.? టీడీపీ ఎమ్మెల్యే వంశీ ఎలా వైసీపీ వైపుకు వెళ్ళారు. మరో టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరి మాటేమిటి.? చెప్పుకుంటూ పోతే కథ చాలానే వుంది.
‘మా ముఖ్యమంత్రి నిప్పు..’ అని చెప్పుకునేందుకు వైసీపీ పడరాని పాట్లూ పడుతోంది. ఇదిలా వుంటే, మండలి ఛైర్మన్ షరీఫ్, వికేంద్రీకరణ అలాగే సీఆర్డీయే ఉపసంహరణ బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపే విషయమై ఆయా పార్టీలకు లేఖలు రాశారు. కమిటీల్లో సభ్యులుగా ఎవరుండాలన్నది ఆయా పార్టీలు నిర్ణయించుకోవాలన్నది మండలి ఛైర్మన్ రాసిన లేఖల సారాంశం.
అసలు మండలి అనేది వుండదు.. అన్న చర్చ జరుగుతున్న వేళ, మండలి ఛైర్మన్ ఈ నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యకరమే. మరోపక్క, అసెంబ్లీలో మండలి రద్దుపై తీర్మానం జరిగినా.. కేంద్రం దాన్ని ఆమోదించాలి. కేంద్ర క్యాబినెట్ ఈ విషయమై బిల్లు రూపొందించి, పార్లమెంటు ఉభయ సభల్లోనూ దాన్ని ఆమోదించాల్సి వుంటుంది. సో.. వైఎస్ జగన్, తనంతట తానుగా మండలి రద్దుపై నిర్ణయం తీసుకుంటే కుదరదు. అన్నట్టు బీజేపీకి కూడా మండలిలో ప్రాతినిథ్యం వుందన్న విషయం తెల్సిందే.
240516 416009I usually cant locate it in me to care enough to leaves a comment for articles on the internet but this was truly pretty great, thanks and maintain it up, Ill check back once again 950284
497957 81392I added this write-up to my favorites and plan to return to digest far more soon. It is effortless to read and realize as effectively as intelligent. I truly enjoyed my initial read through of this post. 19180
257752 635003Music began playing anytime I opened this web site, so irritating! 233328
331818 588752Our own chaga mushroom comes with a schokohutige, consistent, charcoal-like arrival, a complete lot of dissimilar to the style of the normal mushroom. Chaga Tincture 976772
785959 263043Its amazing as your other posts : D, appreciate it for putting up. 896480