Switch to English

ఇది డెమోక్రసి కాదట.. జగన్ కసి అట..!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఏపీలో అధికార, విపక్షాల మధ్య వార్ మరింత ముదురుతోంది. ఏపీ అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును తెలుగుదేశం పార్టీ శాసనమండలిలో అడ్డుకుని సెలెక్ట్ కమిటీకి పంపించడంతో రగలిపోతున్న అధికార వైఎస్సార్ సీపీ.. టీడీపీని కోలుకోలేని దెబ్బ కొట్టాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా తనకు రాజకీయంగా నష్టం జరిగినా సరే.. మండలిని రద్దు చేయడానికీ వెనకాడటంలేదు. మండలి భవితవ్యం తేలడానికి ఇంకా మరికొద్ది గంటలే మిగిలి ఉంది.

ఈలోగా టీడీపీ ఎమ్మెల్సీలు మనసు మార్చుకుని ప్రభుత్వానికి మద్దతుగా నిలిస్తే, మండలి ఉంటుందని.. లేకుంటే కాలగర్భంలో కలిసిపోతుందని అధికార పార్టీ నేతలు గట్టిగానే హెచ్చరికలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ దీనిపై తీవ్రంగా మండిపడుతోంది. మండలి రద్దు రాష్ట్రం పరిధిలోని అంశం కాదని.. అది కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సిన అంశమని.. అందువల్ల ఎమ్మెల్సీలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని చంద్రబాబు చెబుతున్నారు.

మండలి వ్యవహారంలో టీడీపీ నేతలు పైకి గంభీరంగా కనిపిస్తున్నప్పటికీ.. నిజంగా శాసనమండలిని రద్దు చేస్తే తలెత్తే పరిణామాలు ఏమిటని చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ నిర్ణయాన్ని తూర్పారబడుతున్నారు. మనం డెమోక్రసిలోని లేమని, ఇది జగన్ కసి అని విశ్లేషణలు చేస్తున్నారు. మండలి రద్దుకు రాష్ట్రానికి అధికారమే లేదని మండలిలో విపక్ష నేత యనమల పేర్కొంటున్నారు. ప్రభుత్వానికి అంత పట్టుదలగా ఉంటే శాసనసభను కూడా రద్దు చేయండంటూ సవాల్ చేస్తున్నారు.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ సైతం సర్కారుపై విమర్శలు గుప్పిస్తున్నారు. వాస్తవానికి మండలి రద్దు అయితే ఎక్కువగా నష్టపోయేది యనమలే. ఆయన పదవీకాలం 2025 వరకు ఉన్నందునే ఆయనలో అసహనం పెరిగి, మాట్లాడితే శాసనసభను కూడా రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారని వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు.

మరోవైపు మండలి వ్యవహారంలో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై అధికార పార్టీ సమాలోచనలు చేస్తోంది. టీడీపీ ఎమ్మెల్సీలు ఆ పార్టీని విభేదించి వస్తే మండలి రద్దుపై పునరాలోచన చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఆదివారం జరిగిన టీడీఎల్పీ భేటీకి ఐదుగురు ఎమ్మెల్సీలు గైర్హాజరు కావడం చర్చనీయాంశమైంది. అయితే, వారంతా వివిధ కారణాలరీత్యా హాజరుకాలేకపోతున్నామని ముందుగానే సమాచారం ఇచ్చారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇక సోమవారం నాటి శాసనసభ సమావేశానికి హాజరుకాకూడదని టీడీఎల్పీ భేటీలో నిర్ణయం తీసుకున్నారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...