కీర్తి సురేష్ కెరీర్ చాలా ఆసక్తికరంగా సాగుతోంది. మహానటి తర్వాత ఆమె ఖ్యాతి చాలా పెరిగింది. అవార్డులు, రివార్డులు అందుకుంటోంది. అయితే ఆ సినిమా తర్వాత సినిమాల ఎంపికలో కొంచెం నెమ్మదించినట్లు అనిపించిన కీర్తి సురేష్ ఇప్పుడు దూసుకుపోతోంది. కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్ ఇటీవలే విడుదలైంది. మిస్ ఇండియా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇది కాకుండా మరో లేడీ ఓరియెంటెడ్ చిత్రం గుడ్ లక్ సఖి చిత్రం షూటింగ్ లో ఉంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు మాత్రమే కాకుండా కమర్షియల్ చిత్రాల్లో కూడా కీర్తి సురేష్ భాగమవుతోంది. నితిన్ తో రంగ్ దే సినిమాలో నటిస్తోన్న కీర్తి సురేష్, నితిన్ తో పవర్ పేట చిత్రంలో కూడా ఎంపికైంది.
ఇవన్నీ కాకుండా తన కెరీర్ లో బిగ్గెస్ట్ ఛాన్స్ ను పట్టేసిందని వార్తలొచ్చాయి. అదే, సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన సర్కారు వారి పాట చిత్రంలో కీర్తి సురేష్ ఎంపికవ్వడం. ఈ విషయంపై ఈ చిత్ర టీం కచ్చితమైన నిర్ణయం చెప్పడం లేదు. ప్రొడక్షన్ టీం హీరోయిన్ ని ఖరారు చేయకముందే ఇప్పుడు ఈ సినిమాలో కీర్తి సురేష్ చేయబోయే పాత్ర ఇదేనంటూ ఒక వార్త షికారు చేస్తోంది. అదే కీర్తి సురేష్ ఈ సినిమాలో బ్యాంక్ ఎంప్లొయ్ పాత్రను పోషిస్తోందిట. ఈ చిత్రం ప్రధానంగా బ్యాంక్ స్కామ్స్ పై ఉంటుందని తెలుస్తోన్న నేపథ్యంలో కీర్తి సురేష్ పాత్ర కూడా దానికి రిలేటడ్ గానే ఉండడం విశేషం.
థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. సెప్టెంబర్ నుండి షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది.
552714 46075 Youre so cool! I dont suppose Ive read anything like this before. So good to uncover somebody with some original thoughts on this topic. realy thank you for starting this up. this web site is something that is needed on the web, someone with just a little originality. useful job for bringing something new to the internet! 387056
103209 85130i really like action movies and my idol is none other than Gerard Butler. this guy actually rocks 250760
331766 570003This style is steller! You certainly know how to maintain a reader entertained. Between your wit and your videos, I was almost moved to start my own weblog (properly, almostHaHa!) Fantastic job. I truly enjoyed what you had to say, and a lot more than that, how you presented it. Too cool! 892149