మాజీ మంత్రి ఈటల రాజేందర్ నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కాయి. టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకున్న ఈటల.. తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హుజూరాబాద్ కు ఉప ఎన్నిక అనివార్యమవుతోంది. దీంతో అధికార టీఆర్ఎస్ ఇప్పటికే రంగంలోకి దిగిపోయింది. ఈటలకు చెక్ చెప్పేందుకు అవకాశం ఉన్న ఏ మార్గాన్నీ వదులుకోకూడదని భావిస్తోంది. ఇప్పటికే దీనిపై మంత్రులు హరీశ్, గంగుల కమలాకర్ లు పలుదఫాలుగా సమవేశమై కార్యాచరణ రూపొందించారు. ఈటల వెంట పార్టీ కేడర్ వెళ్లకుండా చూడటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల్లో చెరో రూ.50 కోట్లతో అభివృద్ధి పనులు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు.
అలాగే చిన్న, మధ్యతరహా పంచాయతీల్లో రూ.20లక్షలు, మేజర్ పంచాయతీల్లో రూ.30 లక్షలతో పనులు చేస్తామని చెబుతున్నారు. మరోవైపు కొత్త జిల్లా ఏర్పాటు ద్వారా ఈటలకు చెక్ చెప్పే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారం. హుజూరాబాద్ కేంద్రంగా పీవీ జిల్లా ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలోనే దీనిపై డిమాండ్లు వచ్చినా.. ప్రభుత్వం సానుకూలంగా స్పందించలేదు. పీవీ స్వగ్రామం హుజూరాబాద్ లోనే ఉన్నందున ఆయన పేరుతో జిల్లా ఏర్పాటు చేస్తే.. అక్కడి ప్రజల సెంటిమెంట్ ను గౌరవించినట్టు అవుతుందని.. తద్వారా ఈటలకు చెక్ పెట్టొచ్చని అధికార పార్టీ అంచనాలు వేస్తోంది. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
609820 15418when i was a kid, i enjoy to receive an assortment of birthday presents like teddy bears and mechanical toys, 613440
235472 153468Terrific paintings! That could be the type of data that are meant to be shared about the net. Shame on the seek for no longer positioning this publish higher! Come on more than and consult with my web site . Thank you =) 964280
450317 707966You ought to get involved in a contest personally with the finest blogs on-line. I will recommend this page! 68148