Switch to English

90 ఎంఎల్‌ ట్రైలర్‌ రివ్యూ: అథరైజ్డ్‌ డ్రింకర్‌ ‘పెగ్గు’ కహానీ!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

అనారోగ్యంతో డాక్టర్‌ దగ్గరకు వెళితే, రోజూ మూడు పూటలా మూడు టాబ్లెట్లు వేసుకోమని డాక్టరు చెప్పడం మామూలే. కానీ, ఇక్కడ ఓ డాక్టర్‌, మూడు పూటలా పెగ్గు పొయ్యమంటాడు ఓ చిన్న పిల్లాడికి. అదే ’90 ఎంఎల్‌’ సినిమాలో మెయిన్‌ ఎలిమెంట్‌. ‘ఆర్‌ఎక్స్‌ 100′ ఫేం కార్తికేయ హీరోగా నటిస్తోన్న ’90 ఎంఎల్‌’ సినిమా ఆసక్తికరమైన కథాంశంతోనే తెరకెక్కినట్లు కన్పిస్తోంది.

ఈ సినిమా తాజా ట్రైలర్‌లో, సినిమా కథేంటో దాదాపుగా చెప్పేశారు. రొమాన్స్‌, యాక్షన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎమోషన్‌.. ఇలా అన్ని ఎలిమెంట్స్‌నీ సినిమాలో రంగరించారో లేదోగానీ, ట్రైలర్‌లో మాత్రం అవన్నీ కన్పిస్తున్నాయి. ట్రైలర్‌ చూస్తోంటే, ఓ సూపర్‌ హిట్‌ సినిమా తాలూకు ఛాయలు కన్పించడం ఖాయమన్పిస్తోంది. హీరోయిన్‌తో హీరో రొమాంటిక్‌ ట్రాక్‌ ఇంట్రెస్టింగ్‌గానే వుంది.

తల్లిదండ్రులు తమ కుమారుడికి విధిలేని పరిస్థితుల్లో 90 ఎంఎల్‌ పెగ్గుని రోజూ మూడు పూటలా అందించాల్సి రావడం ఎమోషనల్‌గా టచ్‌ చేస్తోంది. ఆ పెగ్గు కహానీ బోల్డంత ఫన్‌ కూడా క్రియేట్‌ చేస్తోంది. ఆ పెగ్గు కహానీనే, హీరోయిన్‌తో హీరో దూరమయ్యేలా చేస్తుండడమూ ఇంట్రెస్టింగ్‌ ఎలిమెంట్‌. ఇవన్నీ ఓ ఎత్తు.. యాక్షన్‌ ఎపిసోడ్స్‌ ఇంకో ఎత్తు.. అన్నట్లు యాక్షన్‌ సన్నివేశాలు కన్పిస్తున్నాయి.

బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌, సినిమాలో రిచ్‌నెస్‌.. ఇవన్నీ ట్రైలర్‌లో స్పష్టంగా కన్పిస్తున్న దరిమిలా, సినిమాపై అంచనాలు పెరగడం సహజమే. కార్తికేయ సరసన ఈ సినిమాలో నేహా సోలంకి హీరోయిన్‌గా నటిస్తోంది. అతి శుభ్రం మీద ‘మహానుభావుడు’ సినిమా వస్తే, ‘మతిమరుపు’ మీద ‘భలే భలే మగాడివోయ్‌’ సినిమా వచ్చింది.. ఈ కోవలో చాలా సినిమాలే వచ్చాయి.. అవన్నీ డిజార్డర్‌ బేస్డ్‌ సినిమాలే. వాటితో పోల్చదగ్గ విధంగానే ఈ ’90 ఎంఎల్‌’ కూడా తెరకెక్కినట్లుంది.

‘ఆర్‌ఎక్స్‌ 100′ తర్వాత సరైన హిట్టులేక డీలా పడ్డ కార్తికేయకి ’90 ఎంఎల్‌’ హిట్‌ ఇస్తుందా.? ఇచ్చే లక్షణాలైతే ట్రైలర్‌లో కన్పిస్తున్నాయన్నది నిర్వివాదాంశం.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...