Switch to English

ఏం నాయనా.. కరోనా వైరస్‌కి ‘కమ్మ’టి వ్యాక్సిన్‌ కావాలా.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌లో కుల రాజకీయాల గురించి కొత్తగా చెప్పేదేముంది.? కులాల చుట్టూనే తిరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు. రెడ్డి వర్సెస్‌ కమ్మ.. మధ్యలో కాపు రాజకీయం.. వీటితోపాటు బీసీ, దళిత రాజకీయాలు.. వెరసి రాష్ట్రానికి జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో మేగ్జిమమ్ చెడ్డపేరు తీసుకొచ్చేస్తున్నాయన్నది నిర్వివాదాంశం.

కరోనా వైరస్‌కి త్వరలో వ్యాక్సిన్‌ రాబోతోంది. భారతదేశంలో మొట్టమొదటి వ్యాక్సిన్‌ ‘భారత్‌ బయోటెక్‌’ నుంచి రాబోతోందంటూ ప్రచారం జరుగుతున్న విషయం విదితమే. ఆగస్ట్‌ 15 నాటికి వ్యాక్సిన్‌ తీసుకొచ్చేలా ఐసీఎంఆర్‌, భారత్‌ బయోటెక్‌తో కలిసి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఇక్కడే అసలు కథ మొదలయ్యింది. కొందరు ‘కమ్మ’ సామాజిక వర్గానికి చెందిన నెటిజన్లు (ప్రధానంగా టీడీపీ మద్దతుదారులు) సోషల్‌ మీడియా వేదికగా, ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ (అదేనండీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ)పై ఛలోక్తులు విసురుతున్నారు. ‘‘అది కమ్మ సామాజికవ వర్గానికి చెందిన వ్యక్తి స్థాపించిన కంపెనీ నుంచి వస్తోన్న వ్యాక్సిన్‌.. మీకు ‘కమ్మ’ అన్న పదమే గిట్టదు కదా.. మరి, కరోనా వ్యాక్సిన్‌ని కూడా వద్దంటారా.?’’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పైనా, అధికార వైఎస్సార్సీపీపైనా సెటైర్లు వేస్తున్నారు సదరు టీడీపీ మద్దతుదారులు.

నవ్విపోదురుగాక మనకేటి.? అన్నట్టుంది వ్యవహారం. అయినా, వ్యాక్సిన్ విషయంలో ఇంకా స్పష్టత లేదు. ఆగస్ట్ 15 నాటికి వ్యాక్సిన్ వస్తుందని ఐసీఎంఆర్ ప్రకటించినా.. ఇంకా సమయం పడుతుందని భారత్ బయోటిక్ సంస్థ వర్గాలు చెబుతున్నాయి. సో, ఇల్లు సరిగ్గా అలకకుండానే టీడీపీలో సో కాల్డ్ ‘కమ్మ బ్యాచ్’ పండగ చేసేసుకుంటోందన్నమాట.

వైఎస్సార్సీపీలో కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలున్నారు. అంతెందుకు కమ్మ సామాజిక వర్గానికే చెందిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, టీడీపీని ‘ఛీ’ కొట్టి వైసీపీలో చేరిపోయారు. ప్రతిదానికీ ఈ కులం కంపు ఎందుకు ఆపాదిస్తారో అర్థం కాదు సో కాల్డ్‌ ‘కుల పిచ్చి’గాళ్ళు. కొన్నాళ్ళ క్రితం సోషల్‌ మీడియాలో ‘బ్లడ్‌ డొనేషన్‌’కి సంబంధించి ఓ ట్వీట్‌ వైరల్‌ అయ్యింది. అత్యవసర పరిస్థితుల్లో ఓ వ్యక్తికి రక్తం కావాలనీ, కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మాత్రమే డొనేషన్‌ చేయాలనీ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇదీ, సోకాల్డ్‌ వ్యక్తులకి వున్న ‘కమ్మ’ పైత్యం.

అందరూ అలాగే వుంటారని కాదు. ఆ కొందరి వల్లా, మొత్తంగా సదరు సామాజిక వర్గంపై ఇతరుల్లో చిన్న చూపు కలుగుతుంది ఇలాంటి విషయాల కారణంగానే. ‘అమరావతి’ విషయంలో జరుగుతున్న రచ్చకి ‘కులాన్ని’ ఆపాదించింది ‘కమ్మ’ సామాజిక వర్గానికి చెందిన నేతలే. ఆ సామాజిక వర్గానికి చెందినవారికి లబ్ది చేకూర్చేందుకే చంద్రబాబు, అమరావతి ప్రాంతంలో రాజధాని ప్రకటన చేశారన్న విమర్శలు లేకపోలేదు.

ఆ మాటకొస్తే కొత్త రైల్వే జోన్‌ని విశాఖ కాకుండా విజయవాడ కేంద్రంగా వచ్చేలా అప్పట్లో ‘కమ్మ’ లాబీయింగ్‌ నడిచిన విషయాన్ని ఎలా మర్చిపోగలం.? ‘కమ్మ’ అత్యుత్సాహం మాత్రమే కాదు, అంతకు మించిన ‘రెడ్డి’ అత్యుత్సాహం కూడా రాష్ట్ర రాజకీయాల్లో చూస్తున్నాం. ఇంకా ఆసక్తికరమైన విషయమేంటంటే, రెండు ప్రధాన రాజకీయ పార్టీలు, ‘కాపు’ సామాజిక వర్గంలో చీలికలు తెచ్చి అప్పుడూ, ఇప్పుడూ పండగ చేసుకుంటున్నాయ్‌.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...