షాహిద్ కపూర్, టాలీవుడ్ లో క్రేజీ హిట్ గా నిలిచిన అర్జున్ రెడ్డి చిత్రాన్ని కబీర్ సింగ్ గా రీమేక్ చేసి సూపర్ హిట్ ను అందుకున్నాడు. అదే కోవలో తన తర్వాతి చిత్రం జెర్సీ రీమేక్ ప్రకటించాడు. తెలుగులో జెర్సీ ఒక క్లాసికల్ హిట్. అందుకే జెర్సీ హిందీ రీమేక్ పై అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి.
అయితే ఈ చిత్రం ఇప్పుడు భారీ డిజాస్టర్ అయింది. బాలీవుడ్ చిత్రాల్లోనే భారీ డిజాస్టర్లలో జెర్సీ కూడా ఒకటి. ఈ చిత్రం తొలి వీకెండ్ లో కేవలం 16 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. ఫుల్ రన్ లో 25 కోట్ల రూపాయల మార్క్ ను అందుకోవచ్చు.
ఇంత దారుణమైన ఫలితాన్ని అందుకోవడానికి కేజిఎఫ్ చాప్టర్ 2 తో పోటీ ప్రధాన కారణం. కేజిఎఫ్ 2 విడుదలైన వారానికే జెర్సీని దింపడం మెయిన్ మైనస్ కాగా ఒరిజినల్ నాని వెర్షన్ ను చాలా మంది ఓటిటిలో చూసేసారు.