మూడు.. ఈ పేరు చెప్పి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద వైసీపీ, టీడీపీ సెటైర్లు వేయడం చూశాం. అది పవన్ కళ్యాణ్ చేసుకున్న పెళ్ళిళ్ళ లెక్క. దానిపై టీడీపీ, వైసీపీ చేసే దిక్కుమాలిన రాజకీయ విమర్శల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.!
రాష్ట్రానికి రాజధాని ఎందుకు లేదు.? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తే, ‘పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు’ అనే విమర్శ వైసీపీ నుంచి వస్తుంటుంది. ఇదొక్కటే కాదు, ఏ విషయమ్మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించినా ఇదే తంతు.!
కొత్తగా దత్త పుత్రుడంటూ చెత్త విమర్శలు తెరపైకొచ్చాయి పవన్ కళ్యాణ్ మీద. కౌలు రైతులకు సాయం చేయండి.. అని ప్రభుత్వాన్ని జనసేన అధినేత అడిగితే, ‘చంద్రబాబు దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్..’ అంటూ ముఖ్యమంత్రి విమర్శిస్తున్నారు. ఇలా తయారైంది రాష్ట్రంలో రాజకీయం.
అందుకే, ఈసారి ‘ట్రిపుల్’ షాక్ ఇచ్చారు జనసేనాని. అందులో వైసీపీ, టీడీపీ అలాగే బీజేపీ కూడా వున్నాయ్. మిత్రపక్షం బీజేపీకి కూడా జనసేనాని ఎందుకు షాక్ ఇవ్వాల్సి వచ్చిందన్నదానిపై జనసైనికుల్లో స్పష్టత వుంది. బీజేపీ పేరుకే మిత్రపక్షం తప్ప, జనసేనతో నిఖార్సయిన మిత్రపక్షంలా వ్యవహరించడంలేదు.
రాజధాని అమరావతి విషయంలో కావొచ్చు, మరో విషయంలో కావొచ్చు.. ఏపీ బీజేపీది ఒక తీరు, కేంద్ర బీజేపీది ఇంకో తీరు. ఈ నేపథ్యంలో, ‘రోడ్ మ్యాప్’ అడిగి రోజులు గడుస్తున్నా బీజేపీ అధిష్టానం నుంచి స్పష్టత లేకపోవడంతో, ‘సోలో ఫైట్’ అంటూ బీజేపీకి షాక్ ఇచ్చారు జనసేనాని. ‘మాకు జనంతో తప్ప ఎవరితోనూ పొత్తులు లేవు..’ అని పవన్ తేల్చేయడంతో బీజేపీ గింజుకుంటోందిప్పుడు.
‘దత్తపుత్రుడు’ అంటూ వైసీపీ, జనసేన మీద చేస్తున్న విమర్శల్ని ఎంజాయ్ చేసిన టీడీపీ, ఎప్పుడైతే జనసేనాని ‘సోలో ఫైట్’ అన్నారో, ఒక్కసారి ఉలిక్కిపడింది. జనసేన ఒంటరిగా ఎన్నికలకు వెళితే వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోతుందనీ, అది వైసీపీకే లాభిస్తుందనీ టీడీపీ అనుకూల మీడియాలో టీడీపీ నేతలు పడీ పడీ ఏడుస్తున్నారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.
ఇంకోపక్క, వైసీపీ కూడా జనసేనాని ప్రకటనతో ఆందోళనలో పడింది. ఏమో, రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. అసలే వైసీపీ ఎమ్మెల్యేలను జనం తరిమికొడుతున్నారాయె
880248 674544surely like your internet web site but you want to check the spelling on several of your posts. Several of them are rife with spelling difficulties and I discover it very troublesome to tell the truth nevertheless I will certainly come back once more. 474881
928662 195155Its a shame you dont have a donate button! Id without a doubt donate to this brilliant weblog! I suppose for now ill settle for book-marking and adding your RSS feed to my Google account. I appear forward to fresh updates and will share this weblog with my Facebook group. Chat soon! 952011
259728 5901I havent checked in here for some time because I thought it was obtaining boring, but the last couple of posts are really very good quality so I guess Ill add you back to my every day bloglist. You deserve it my friend. insurance guides 295023