ప్రముఖ ఫార్మా కంపెనీ ఫైజర్ తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్ కు సంబంధించిన ట్రయల్స్ నడుస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ రెండవ దశ ప్రయోగం పూర్తి అయ్యింది. ఆరు దేశాల్లో మొత్తం 45 వేల మందిపై టీకాను ప్రయోగించడం జరిగింది. ఈ టీకా తీసుకున్న ఒక వ్యక్తి తనకు అనారోగ్య సమస్యలు తలెత్తినట్లుగా చెప్పడంతో వ్యాక్సిన్ పనితీరుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. టెక్సస్ కు చెందిన 45 ఏళ్ల వ్యక్తి టీకా రెండవ డోసు తీసుకున్నాడు. ఆయనకు జ్వరం మరియు ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తాయి.
కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఇటీవలే ఫైజర్ వారు తమ టీకా చాలా ప్రభావితంగా పని చేస్తుందని చెప్పారు. కాని ఇప్పుడు దాని పనితీరుపై అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో సంస్థ నుండి ఎలాంటి స్పందన వస్తుంది అనేది చూడాలి. అయితే అంతర్జాతీయ మీడియాలో మాత్రం ఫైజర్ వల్ల అత్యధికంగా ప్రయోజనాలు ఉన్నాయి. 92 శాతం ప్రయోజనకారి కనుక నిర్భయంగా నిరభ్యంతరంగా వ్యాక్సిన్ ను ముందుకు తీసుకు వెళ్లవచ్చు అంటూ అభిప్రాయం వ్యక్తం అవుతున్నాయి.
515325 656019Spot lets start on this write-up, I seriously believe this remarkable website requirements a lot much more consideration. Ill far more likely once once more to read a great deal more, many thanks that info. 99728