IndiGo: కార్గిల్ (Kargil War Hero) యుద్ధ వీరుడికి ఇండిగో (IndiGo) విమానం అపూర్వ స్వాగతంతోపాటు చిరు కానుక అందించి గౌరవించింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఇండిగో ట్విట్లర్లో పంచుకుంటూ.. ‘హీరోతో ప్రయాణం’ అని రాసుకొచ్చింది. వివరాల్లోకి వెళ్తే..
సుబేదార్ మేజర్ సంజయ్ కుమార్ ఆదివారం పూణెకు ఇండిగో విమానంలో ప్రయాణించారు. టేకాఫ్ కు మందు కెప్టెన్ అనౌన్స్ చేస్తూ.. ‘మనం ఈ రోజు పరమ్ వీర్ చక్ర (Param Veer Chakra) అవార్డు గ్రహీత సుబేదార్ మేజర్ సంజయ్ కుమార్ తో ప్రయాణం చేస్తున్నాం. యుద్ధ వీరులకు అందించే అత్యున్నత గ్యాలెంట్రీ అవార్డు. భారతదేశ చరిత్రలో ఇప్పటివరకూ కేవలం 21 మంది మాత్రమే అందుకున్నారు’.
‘1999 జూలై 4న జమ్మూ కశ్మీర్ రైఫిల్స్ 13వ బెటాలియన్ లో ఉన్న సంజయ్ కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడారు. ఛాతీలోకి రెండు, మణికట్టుపై ఒక బుల్లెట్ దిగినా శత్రువుల బంకర్లోకి వెళ్లి పాకిస్థాన్ సైనికులను హతమార్చార’ని చెప్పడంతో ప్రయాణికులు చప్పట్లతో అభినందించారు. హిమాచల్ ప్రదేశ్ కు చెందిన సంజయ్ కుమార్ ప్రస్తుతం పుణెలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో విధులు నిర్వర్తిస్తున్నారు.
Flying with a hero: Subedar Major Sanjay Kumar ji, a Living Param Veer Chakra awardee! #goIndiGo #IndiaByIndiGo pic.twitter.com/CZsqlHxRj6
— IndiGo (@IndiGo6E) July 23, 2023