Switch to English

వచ్చేస్తోంది హైదరాబాద్ మహా మెట్రో.. రూ. 69 వేలకోట్ల వ్యయంతో..!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

తెలంగాణ ప్రభుత్వం తాజాగా నిర్వహించిన మంత్రిమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ లో మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలన్న ఉద్దేశంతో రూ.69 వేల కోట్ల వ్యయంతో నగరం నలువైపులా మెట్రోని విస్తరించాలని నిర్ణయించారు. మూడో దశ విస్తరణలో భాగంగా 278 కిలోమీటర్ల పొడవున కొత్తగా 8 మార్గాలతో పాటు ఔటర్ రింగ్ రోడ్డు వెంట మరో నాలుగు మార్గాల్లో మెట్రో నిర్మించనున్నారు. వర్షాల సమయంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతుండటంతో వాటిని నియంత్రించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కొత్తగా నగరంలోకి ఫార్మాసిటీ రానుండటంతో శంషాబాద్ విమానాశ్రయం నుంచి జల్పల్లి, తుక్కుగూడ మీదుగా కందుకూరు వరకు మెట్రోను విస్తరించనున్నారు.

మంత్రిమండలి సమావేశం సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..’ హైదరాబాద్ మహానగరం తెలంగాణకు గుండెకాయ లాంటిది. దేశంలో వేగంగా డెవలప్ అవుతున్న నగరాల్లో హైదరాబాద్ అగ్రభాగాన ఉంది. సిటీ ఎంత పెరిగినా, ఎన్ని పరిశ్రమలు వచ్చినా, ఎంతమంది ప్రజలు సిటీలోకి వచ్చినా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అన్ని హంగులతో దీన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దుతాం. వచ్చే నాలుగేళ్లలో రూ.69 వేల కోట్లతో మెట్రోని మరింతగా విస్తరిస్తాం. దీనికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందని ఆశిస్తున్నాం. కేంద్రం సాయం చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని పూర్తి చేస్తుంది’ అని తెలిపారు.

ప్రతిపాదనలో ఉన్న కొత్త రూట్లు ఇవే..

హైదరాబాద్ లో ఇప్పటికే 70 కిలోమీటర్ల మెట్రో విస్తరణకు శంకుస్థాపన చేశారు. దీనికి అదనంగా రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు 31 కిలోమీటర్ల మేర విస్తరించనున్నారు. కొత్తగా జూబ్లీ బస్టాండ్ నుంచి తూకుంట వరకు డబుల్ డెక్కర్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. దానిపై ఒక అంచె లో వాహనాలు, మరో అంచెలో మెట్రో రైలు రాకపోకలు సాగిస్తాయి. ప్యాట్ని సెంటర్ నుంచి కండ్లకోయ వరకు మరో డబుల్ డెక్కర్ నిర్మాణాన్ని చేపడతారు. ఇస్నాపూర్ నుంచి మియాపూర్ వరకు అక్కడ నుంచి లక్డికాపూల్ వరకు, విజయవాడ మార్గంలో ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ మీదుగా పెద్ద అంబర్ పేట వరకు మెట్రో సేవలు విస్తరించనున్నారు. ఇక ఉప్పల్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ వరకు విస్తరణ జరగనుంది.

శంషాబాద్ నుంచి మెట్రో విస్తరించే ప్రతిపాదనలో భాగంగా కొత్తూరు షాద్ నగర్ మధ్య మెట్రో మార్గాన్ని నిర్మించనున్నారు. ఉప్పల్ నుంచి ఈసీఐఎల్ క్రాస్ రోడ్డు వరకు మెట్రో నిర్మాణాన్ని చేపట్టడంతోపాటు ఓల్డ్ సిటీలోని మెట్రో మార్గాన్ని పూర్తి చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

రాజకీయం

జగన్, చంద్రబాబు.. విదేశీ ‘రాజకీయ’ పర్యటనల వెనుక.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. నారా చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం వుందట. విదేశాలకు వెళితే తప్పేముంది.? ఒకరు విదేశాలకు వెళితే, పారిపోయినట్టు...

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

ఎక్కువ చదివినవి

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా వైరల్ అయింది. ప్రభాస్ పెళ్లి గురించే...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...