Switch to English

ఎగ్జిట్ పోల్స్ ని ఎంతవరకు నమ్మొచ్చు?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

సార్వత్రిక ఎన్నికల చివరి విడత పోలింగ్ ఆదివారం సాయంత్రంతో ముగియనుంది. దేశంలో ఎన్నికలు మొదలై అప్పుడే 40 రోజులు దాటడంతో అందరిలోనూ ఉత్కంఠ రాజ్యమేలుతోంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? తమ రాష్ట్రంలో ఏ పార్టీ గద్దెనెక్కుతుంది? తమ ఎంపీ గెలుస్తాడా? తమ ఎమ్మెల్యేని విజయం వరిస్తుందా? వంటి ప్రశ్నలు అందరి మదినీ తొలిచేస్తున్నాయి. 23వ తారీఖు ఎప్పుడొస్తుందా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అంతవరకు ఆగలేని వారి కోసం ఆదివారం ఎగ్జిట్ పోల్స్ రానున్నాయి. చాలామంది వీటి కోసం కూడా చాలా ఆతృతగా చూస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో కొంతవరకు స్పష్టత వస్తుందని అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ ఎగ్జిట్ పోల్స్ కచ్చితమైన ఫలితాల్నే వెల్లడిస్తాయా? వాటిని ఎంతవరకు నమ్మొచ్చు? అంటే కచ్చితంగా నమ్మొచ్చని మాత్రం చెప్పలేం.

ఎందుకంటే ఇప్పటివరకు చాలా సంస్థలు తమ తమ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించాయి. అన్నిసార్లూ అవి కచ్చితమైన ఫలితాలను మాత్రం వెల్లడించలేదు. కొన్ని సందర్భాల్లో మాత్రమే అవి నిజమయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వాస్తవ ఫలితాలకు దగ్గరగా ఉండటం అనేది అవి నిర్వహించిన తీరుపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఎన్నికల సర్వేలు ప్రీపోల్ సర్వే, ఎగ్జిట్ పోల్ సర్వే, పోస్ట్ పోల్ సర్వే అని మూడు రకాలుగా ఉంటాయి. ఎన్నికలు జరగడానికి ముందుగా నిర్వహించేవి ప్రీపోల్ సర్వే. వీటిలో నియోజకవర్గానికి నిర్ధారిత శాంపిల్ తీసుకుని వారి అభిప్రాయాలను సేకరించి, అనంతరం శాస్త్రీయ పద్ధతిలో వాటన్నింటినీ క్రోఢీకరించి ఓ అంచనాకు వస్తారు. ఇక పోస్ట్ పోల్ సర్వే అనేది ఎన్నికలు ముగిసిన తర్వాత ఎవరికి ఓటేశారు అనే అంశాన్ని ఆరా తీయడం ద్వారా ఫలితాలు అంచనా వేస్తారు. ఎగ్జిట్ పోల్ అనేది పోలింగ్ జరిగే రోజునే తెలుసుకునే సర్వే. ఓటర్లు పోలింగ్ కేంద్రంలో నుంచి బయటకు వచ్చే సమయంలో వారు ఎవరికి ఓటేశారనే విషయాన్ని అడిగి తెలుసుకుంటారు.

ప్రీపోల్, పోస్ట్ పోల్ సర్వేలకంటే ఎగ్జిట్ పోల్ సర్వేకే కాస్త విలువ ఎక్కువ. అయితే, ఇటీవల కాలంలో ఓటరు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నాడు. తాను ఏ పార్టీకి ఓటేశాననే విషయం కచ్చితంగా చెప్పడంలేదు. అడిగిన వ్యక్తిని బట్టి అతడి సమాధానం ఉంటుంది. అంటే.. అధికార పక్షానికి చెందిన వ్యక్తులు అడిగితే, అధికార పార్టీకే ఓటేశానని, ప్రతిపక్ష పార్టీవాళ్లు అడిగితే వారికే వేశానని చెప్పడం ద్వారా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. దీంతో ఇలాంటి సర్వేలు నిజం కావడం అనేది చాలా అరుదుగా జరుగుతోంది. 2004 ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని చాలా సర్వేలు వెల్లడించాయి. కానీ యూపీఏ అధికారంలోకి వచ్చింది. 2009లో యూపీఏకి వచ్చే సీట్ల సంఖ్యను సరిగా అంచనా వేయడంలో ఎగ్జిట్ పోల్స్ విఫలమయ్యాయి. 2014లో ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని చెప్పినప్పటికీ, ఆ కూటమికి వచ్చే సీట్లను కచ్చితంగా చెప్పలేకపోయాయి.

ఇక ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా పలు సంస్థల ఎగ్జిట్ పోల్స్ తమ ఫలితాలు వెల్లడించాయి. వాటిలో ఎక్కువ సంస్థలు టీఆర్ఎస్ కే అనుకూలంగా తమ ఫలితాలు చెప్పినప్పటికీ, ఆ పార్టీకి వచ్చే సీట్లను మాత్రం సరిగా అంచనా వేయలేకపోయాయి. ఒక్క ఇండియాటుడే సర్వే తప్ప మిగిలిన సంస్థలన్నీ 50 నుంచి 65 సీట్లు మాత్రమే టీఆర్ఎస్ కు వస్తాయని పేర్కొన్నాయి. అంటే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను బట్టి ఒక అంచనాకు రావడం వీలువుతుంది కానీ, అవి వంద శాతం నిజమవుతాయనే మాత్రం అనుకోనవసరం లేదు. తాజాగా తన ఫలితాలను వెల్లడించిన సందర్భంగా విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కూడా ఇదే విషయం చెప్పారు. అంటే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ఆధారంగా చేసుకుని బెట్టింగులు మాత్రం కట్టి నష్టపోవద్దని పలువురు హెచ్చరిస్తున్నారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...