Switch to English

గవర్నర్ సాబ్.. జగన్ స్టెప్ ఏంటి?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గ విస్తరణ హడావుడి ఓవైపు జరుగుతుండగా.. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు అకస్మాత్తుగా రాజ్ భవన్లో ప్రత్యక్షమయ్యారు. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తో దాదాపు గంటన్నరపాటు సమావేశమయ్యారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత నేరుగా గవర్నర్ ను కలిసి రాజీనామా సమర్పించకుండా.. దూత ద్వారా రాజీనామా లేఖను పంపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎంగా రాజీనామా చేసిన తర్వాత గవర్నర్ ను చంద్రబాబు కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ అని టీడీపీ వర్గాలు చెబుతున్నప్పటికీ, ప్రస్తుత రాజకీయా పరిణామాలతోపాటు చాలా విషయాలు వీరి మధ్య చర్చకు వచ్చినట్టు సమాచారం. ఇటీవల ఎన్నికలకు ముందు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి రాష్ట్రంలో ప్రవేశానికి వీలుగా ఉన్న సాధారణ సమ్మతిని వెనక్కి తీసుకుంటూ చంద్రబాబు సర్కారు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా జగన్ ఏపీ సీఎం అయిన వెంటనే బాబు సర్కారు జారీచేసిన జీవోను రద్దు చేస్తూ.. తిరిగి సీబీఐ రాష్ట్రంలో ప్రవేశించేందుకు వీలుగా సాధారణ సమ్మతి పునరుద్ధరించారు. ఈ మేరకు గురువారం ఆదేశాలు జారీచేశారు.

మరోవైపు గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాల నిగ్గు తేలుస్తామని, తమ ప్రభుత్వంలో అలాంటివాటికి తావు లేకుండా పనిచేస్తామని ప్రమాణ స్వీకారం రోజునే జగన్ స్పష్టంచేశారు. గత ప్రభుత్వ అక్రమాలు తిరగతోడటం, సీబీఐకి సాధారణ సమ్మతిని పునరుద్ధరించడం వంటి పరిణామాలు చంద్రబాబును లక్ష్యంగా చేసుకోవడానికే సాగుతున్నాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సైతం బాబు సంగతి చూడాలనే భావనతో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు గవర్నర్ తో సమావేశం కావడం ప్రాధాన్యత ఏర్పడింది. ఇటు జగన్ తోనూ, అటు కేంద్రంతోనూ సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న నరసింహన్ ద్వారా అసలు విషయం ఏమిటో తెలుసుకునే ఉద్దేశంతోనే ఆయన్ను బాబు కలిశారని అంటున్నారు. దాదాపు గంటన్నరకు పైగా సాగిన ఈ సమావేశంలో ప్రధానంగా ఇవే అంశాలపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది.

వాస్తవానికి గవర్నర్ నరసింహన్ విషయంలో చంద్రబాబు చాలా ప్రతికూలంగా వ్యవహరించారు. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీగా ఉన్నప్పుడు నరసింహన్ ను తప్పించడానికి తెరవెనుక చంద్రబాబు గట్టిగానే ప్రయత్నాలు చేశారని అంటారు. ఒకానొక దశలో గవర్నర్ పై టీడీపీ నేతలు విమర్శలతో విరుచుకుపడ్డారు. అలాంటిది ఇప్పుడు అదే గవర్నర్ ద్వారా అసలు ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి చంద్రబాబు ప్రయత్నించడం గమనార్హం.

వాస్తవానికి చంద్రబాబు శుక్రవారం విదేశీ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అయితే, పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఇబ్బందిగా మారడంతో ఆ పర్యటన రద్దు చేసుకున్నారు. ఇకపై హైదరాబాద్లో వారానికి మూడు రోజులు ఉండాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. గతంలో జగన్ హైదరాబాద్ లో ఉండటంపై తీవ్ర విమర్శలు చేశారు. లోటస్ పాండ్ వదిలి రాష్ట్రానికి రారంటూ దుయ్యబట్టారు. తాజాగా చంద్రబాబు అదే నిర్ణయం తీసుకోవడం గమనార్హం. తెలంగాణలో పార్టీ బలోపేతం కోసమే ఈ నిర్ణయం అని చెబుతున్నా.. అసలు కారణాలు వేరే ఉన్నాయని అంటున్నారు.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

రాజకీయం

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎక్కువ చదివినవి

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...