ఉత్తర ప్రదేశ్లోని కాన్పూర్ లో ఒక మేక వింత జీవికి జన్మనిచ్చింది. కోతి ముఖం కలిగి ఉండటం వల్ల స్తానికుల్లో ఆసక్తి నెలకొంది. పుట్టినప్పటికే ఆ వింత మొహం ఉన్న మేక పిల్ల మృతి చెండడంతో కొద్ది సమయం తర్వాత ఖననం చేశారు. అప్పటికే చాలా మందికి విషయం తెలిసి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వందల మంది చూసేందుకు వచ్చారు. కోతి ముఖం ఉండటం వల్ల కొందరు కలియుపు దైవం అంటూ పూజలు చేశారు.
మేక జన్యులోపంతో ఇలాంటి జీవికి జన్మనిచ్చిందని, ఇది అరుదుగా జరుగుతుందని దీంట్లో అద్బుతాలు ఏమీ లేవంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఊరంతా ఈ జీవిని చూసేందుకు రావడంతో పాటు కొందరు డబ్బులు కూడా అక్కడ వేశారు. మూడ నమ్మకాలతో ఆ జీవిని మరింత సమయం ఉంచడం మంచిది కాదంటూ స్థానికుల్లో కొందరు విద్యావంతులు దానికి ఖననం చేయాలని సూచించారు.
369810 621556We guarantee authentic brands avoiding inferior commercial imitations, or even dangerous counterfeits. 116197