Switch to English

హ్యాపీ ఫాదర్స్ డే: పుత్రోత్సాహమంతా ఈ తండ్రులదే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

మంచి చెడుల సంగతి తర్వాత. తప్పొప్పుల ప్రస్తావన ఇక్కడ అనవసరం. రాజకీయాలు అసలే అనవసరం. రాజకీయ విమర్శలు అసందర్భం. హ్యాపీ ఫాదర్స్ డే.! నాన్నలందరికీ శుభాకాంక్షలు. రాజకీయాల్లోనూ ‘నాన్నలు’ వున్నారు. పుత్రోత్సాహంతో ఉప్పొంగిపోతున్నవారు.. తమ పుత్ర రత్నాలు రాజకీయ వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని, తమ పేరు నిలబెడతారన్న ఆశతో వున్న తండ్రులూ వున్నారు. ఈ లోకాన లేకపోయినా, తమ వారసుల విజయాల్ని ఎంజాయ్ చేస్తున్న ‘నాన్న’ల గురించీ ప్రత్యేకంగా చెప్పుకోవాలి.!

వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. జగన్ మోహన్ రెడ్డి..

హ్యాపీ ఫాదర్స్ డే: పుత్రోత్సాహమంతా ఈ తండ్రులదే.!

తన తండ్రి నుంచి రాజకీయ వారసత్వాన్ని అంది పుచ్చుకున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తండ్రి బాటలోనే పాదయాత్ర చేశారు. తండ్రి మరణానంతరం తనకు రాజకీయంగా ఎదురైన ఇబ్బందుల నేపథ్యంలో ధైర్యంగా నిలబడ్డారు. రాజశేఖర్ రెడ్డి అంటే మొండి ధైర్యానికి నిలువెత్తు నిదర్శనం. అదే మొండి ధైర్యంతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా నిలబడ్డారు.. సాధించారు. తండ్రి పేరు నిలబెట్టారు. ‘రాజన్న పుత్రుడు’, ఆ రాజన్న పేరు నిలబెడుతూ, తన హయాంలో సంక్షేమ పథకాలకు ఆ రాజన్న పేరు పెడుతున్నాడు. అలా జనం మదిలో రాజన్న పేరు మరింత బలంగా నాటుకుపోయేలా చేయగలుగుతున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. వైఎస్సార్ కుమార్తె షర్మిల కూడా తెలంగాణలో రాజన్న రాజ్యం స్థాపిస్తానంటోంది.. అదెప్పుడు సాధ్యమయ్యేనో.!

కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. తారకరామారావు..

హ్యాపీ ఫాదర్స్ డే: పుత్రోత్సాహమంతా ఈ తండ్రులదే.!

తండ్రికి తగ్గ తనయుడే కాదు, తండ్రికి మించిన తనయుడు కూడా.! కేసీయార్ రాజకీయ వ్యూహాలు రచించడంలో దిట్ట. ఆ కేసీయార్‌కి వెన్నూ దన్నూ కేటీయార్. ఔను, తెలంగాణ ఉద్యమంలో కేసీయార్ వెన్నంటే కేటీయార్ వున్నారు. విదేశాల్లో మంచి ఉద్యోగాన్ని కాదనుకుని, ముళ్ళ బాట అయిన రాజకీయాల్లోకి ప్రవేశించారు. రాజకీయంగా పదవులు ఆయన ఏం చేపట్టారన్న విషయాన్ని పక్కన పెడితే, కేసీయార్‌కి కేటీయార్ కుడి భుజం. గ్రేటర్ ఎన్నికలు కావొచ్చు, ఇంకో విషయంలో కావొచ్చు.. తండ్రి ఆలోచనలకు తగ్గట్టుగా నడుచుకోవడం కేటీయార్ ప్రత్యేకత. తండ్రికి విజయాలు అందించడం కేటీయార్ గొప్పతనం. ‘నాన్న తర్వాతే నేను..’ అంటారాయన. అటు పార్టీ బాధ్యతల్లో, ఇటు ప్రభుత్వ బాధ్యతల్లో తండ్రికి అండగా, చేదోడువాదోడుగా వుంటున్నారు కేటీయార్. కేసీయార్‌కి ఇంతకన్నా పుత్రోత్సహిం ఇంకేముంటుంది.? ఇంకోపక్క కేసీయార్ కుమార్తె కూడా సక్సెస్‌ఫుల్ పొలిటీషియన్.

నారా చంద్రబాబునాయుడు.. లోకేష్..

హ్యాపీ ఫాదర్స్ డే: పుత్రోత్సాహమంతా ఈ తండ్రులదే.!

తండ్రికి తగ్గ తనయుడు.. అనిపించుకోవడానికి కష్టపడుతున్నాడు నారా లోకేష్. తండ్రి నారా చంద్రబాబునాయుడిని మళ్ళీ అధికార పీఠమెక్కించేందుకు నారా లోకేష్ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. గతంలో చంద్రబాబు హయాంలో మంత్రిగా పని చేశారు. అలా ప్రభుత్వ వ్యవహారాల్లో నాన్నకు చేదోడువాదోడుగా వున్నారు. పార్టీలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ అన్ని వ్యవహారాలూ చక్కన పెడుతున్నారు. ‘మా నాన్నే నాకు హీరో..’ అంటారాయన. తన తండ్రిని గెలిపించి, తానూ గెలిచి.. సత్తా చాటాలనే కసితో వున్నారు నారా లోకేష్. 2024 ఎన్నికల్లో అది సాధ్యమవుతుందని బలంగా నమ్ముతున్నారు. చంద్రబాబు హయాంలో చాలా సంక్షేమ పథకాల వెనుక, లోకేష్ ముద్ర సుస్పష్టం.

వీళ్ళే కాదు.. కింజరాపు ఎర్రనాయుడి రాజకీయ వారసత్వాన్ని నిలబెడుతున్న ఆయన తనయుడు రామ్మోహన్ నాయుడు కావొచ్చు, మరికొందరు రాజకీయ నాయకులు కావొచ్చు.. ‘నాన్నకు ప్రేమతో..’ అంటూ రాజకీయాల్లో తండ్రి గౌరవాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు.. తద్వారా తమ గౌరవాన్ని పెంచుకుంటున్నారు.

10 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...